గుంటూరు జిల్లా తాలుకాలన్నిటిలోనూ పల్నాడు పెద్దది. దీని వైశాల్యం 1050 మైళ్ళు. పలనాటికి ఆ పేరు ఎట్లా వచ్చిందో నిర్దారణ చేసి చెప్పడం కష్టం. ఈ పలనాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య జరిగిన పోరు. దీనిని మహాభారతంతో పోలుస్తారు. భారత కథా ఘట్టాలను పోలిన కథా ఘట్టాలు అనేకం. ఈ వీర చరిత్రలో ఉన్నాయి.
ఒక విధంగా ఇది శైవ, వైష్ణవ మతాల మధ్య సంఘర్షణలా కనిపిస్తుంది. బ్రహ్మనాయుడు వైష్ణవుడు, నాగమ్మ శివ భక్తురాలు. బసవేశ్వరుడు వీర శైవ మతాన్ని స్థాపించిన పిదపనే, పల్నాటి యుద్ధం జరిగింది. బ్రహ్మనాయుడు వర్ణ రహిత సమాజ స్థాపనకు ప్రయత్నించినట్లు వీర చరిత్రలో తెలుస్తుంది.
స్వాతంత్ర్యసమరంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది. గాంధీమహాత్ముని పాద స్పర్శతో పునీతమైన ఆయన ప్రబోధాలకు ప్రభావితమైనది. ఏమైనా పల్నాటి వీరగాథ ఒక కల, కల్పన కాదు, నిజం! ఇది కథ కాదు, జరిగిన కథ, తెలుగు దేశంలో కథ కాదు చరిత్ర. ఈ చరిత్రను గురించిన విశేషాలను వివరించునదే ఈ గ్రంథం.
-రెంటాల గోపాల కృష్ణ.
గుంటూరు జిల్లా తాలుకాలన్నిటిలోనూ పల్నాడు పెద్దది. దీని వైశాల్యం 1050 మైళ్ళు. పలనాటికి ఆ పేరు ఎట్లా వచ్చిందో నిర్దారణ చేసి చెప్పడం కష్టం. ఈ పలనాటి యుద్ధం అన్నదమ్ముల మధ్య జరిగిన పోరు. దీనిని మహాభారతంతో పోలుస్తారు. భారత కథా ఘట్టాలను పోలిన కథా ఘట్టాలు అనేకం. ఈ వీర చరిత్రలో ఉన్నాయి. ఒక విధంగా ఇది శైవ, వైష్ణవ మతాల మధ్య సంఘర్షణలా కనిపిస్తుంది. బ్రహ్మనాయుడు వైష్ణవుడు, నాగమ్మ శివ భక్తురాలు. బసవేశ్వరుడు వీర శైవ మతాన్ని స్థాపించిన పిదపనే, పల్నాటి యుద్ధం జరిగింది. బ్రహ్మనాయుడు వర్ణ రహిత సమాజ స్థాపనకు ప్రయత్నించినట్లు వీర చరిత్రలో తెలుస్తుంది. స్వాతంత్ర్యసమరంలో కూడా ప్రముఖ పాత్ర వహించింది. గాంధీమహాత్ముని పాద స్పర్శతో పునీతమైన ఆయన ప్రబోధాలకు ప్రభావితమైనది. ఏమైనా పల్నాటి వీరగాథ ఒక కల, కల్పన కాదు, నిజం! ఇది కథ కాదు, జరిగిన కథ, తెలుగు దేశంలో కథ కాదు చరిత్ర. ఈ చరిత్రను గురించిన విశేషాలను వివరించునదే ఈ గ్రంథం. -రెంటాల గోపాల కృష్ణ.© 2017,www.logili.com All Rights Reserved.