ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్ క్రాఫ్ట్. అయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్దుడైన మ్యూజికల్ జీనియస్. మూలరచయిత రోమారోలా. ఈయన ఫ్రెంచ్ వాడు, సంగీత దిగ్గజం బితోవెన్ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్ పాత్రను అయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ఆశ్చర్యం లేదు. కళాకారులకు సరిహద్దులు అడ్డురావని చెప్పడమే రచయిత ఉద్దేశం. సంగీత సాహిత్య సాంస్కృతిక రాజకీయ చర్చలతో, విశ్లేషణలతో ఏకంగా ఒక ఎన్సైక్లోపీడియా ని తలపిస్తుంది మూలరచన.
1904-12ల మధ్య పది సంపుటాలుగా వెలువడిన జా క్రిస్తోఫ్ అనే ఈ మూలరచన రెండు వేల పేజిలకు మించిన మహాకావ్యంగా సాగింది. ఇది 1915 లో రచయితకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం, రచనలో స్వారస్యం చెడకుండా తెలుగులో సంక్షిప్తంగా మానవుడు అనే పేరుతో అందించారు కీ.శే. విద్వాన్ విశ్వం. దానినే ఇప్పుడు మీ ముందుంచుతున్నాం.
ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్ క్రాఫ్ట్. అయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్దుడైన మ్యూజికల్ జీనియస్. మూలరచయిత రోమారోలా. ఈయన ఫ్రెంచ్ వాడు, సంగీత దిగ్గజం బితోవెన్ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్ పాత్రను అయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ఆశ్చర్యం లేదు. కళాకారులకు సరిహద్దులు అడ్డురావని చెప్పడమే రచయిత ఉద్దేశం. సంగీత సాహిత్య సాంస్కృతిక రాజకీయ చర్చలతో, విశ్లేషణలతో ఏకంగా ఒక ఎన్సైక్లోపీడియా ని తలపిస్తుంది మూలరచన. 1904-12ల మధ్య పది సంపుటాలుగా వెలువడిన జా క్రిస్తోఫ్ అనే ఈ మూలరచన రెండు వేల పేజిలకు మించిన మహాకావ్యంగా సాగింది. ఇది 1915 లో రచయితకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం, రచనలో స్వారస్యం చెడకుండా తెలుగులో సంక్షిప్తంగా మానవుడు అనే పేరుతో అందించారు కీ.శే. విద్వాన్ విశ్వం. దానినే ఇప్పుడు మీ ముందుంచుతున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.