ఆధునిక విశ్వమానవుడు పెరియార్
వెంకట నాయకర్ తాయమ్మాళ్ వారికి కల్గిరి నల్వురు
సంతానముళ్ ! కృష్ణ, రామసామి, పొన్ను, కన్నమ్మాళ్ !
ఆ రామసామి యే కాబోవు ద్రావిడ కజగం !!
17-9-1879లో జనియించిన రామసామి
బాల్య అవరోధాలు దాటి బాలుడాయెను !!
ఆటపాటలందు అందర్నోడించెను !
అసమానతలను ఎదురించెను!!
అలగా జనంతోనే సంచరించెను !
అందరి ఆహారాలను ఆరగించెను!!
కాళ్ళకు గోలుసులు గుదిబండలేసినా...
అలగాజన పిల్లలతో ఆటలాగ లేదు !
కులాల కుళ్ళును దునుమాడుటాగ లేదు !
మనుషుల పట్ల దయాగుణమాగ లేదు !!
పుక్కిటి పురాణాలను ఎగతాళి చేశాడు !
అయితే దేవుడి పై భక్తి శ్రద్ధలతో ఉన్నాడు !
వ్యాపార విషయాలలో ఆరితేరాడు !
తండ్రికి కుడి భుజంగా మారాడు !!..........
© 2017,www.logili.com All Rights Reserved.