'నేల జారని ఊడలు' ప్రాణ్ రావు ఇదివరకు రచించిన 'మలగని బత్తి' కి కొనసాగింపు (సీక్వెల్) గా రచింపబడిన నవల. 'మలగని బత్తి' లో తిమ్మాపురం అనే గ్రామాన్ని కధా కేంద్రంగా తీసుకుని ఆ ఊరిని, ఆ ఊరి చుట్టుపక్కల వున్న ఇరవై గ్రామాలను ఏలుతున్న నరహరిరావు అనే దొర (జమిందారు) పేద ప్రజల మీద జరుపుతున్న దోపిడీని, హింసను రచయిత చిత్రించాడు. నరహరిరావు జరుపుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు సంగం నాయకత్వంలో గొప్ప పోరాటం చేశారు. తెలంగాణా అంతటా జరిగిన అలాంటి పోరాటాల సమాహారమే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంగా (1946 -51)నిలిచిపోయింది. నరహరిరావు గడీ మీద రాజన్న అనే పోరాట వీరుడు తన దళంతో దాడి చేసినప్పుడు, ఆ పోరాటంలో రాజన్న నరహరిరావు ఇద్దరూ చనిపోతారు. ఇది 'మలగని బత్తి' నవలలోని కధాంశం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పిన నవల 'నేల జారని ఊడలు'.
- ఎస్.ఎమ్. ప్రాణ్ రావ్
'నేల జారని ఊడలు' ప్రాణ్ రావు ఇదివరకు రచించిన 'మలగని బత్తి' కి కొనసాగింపు (సీక్వెల్) గా రచింపబడిన నవల. 'మలగని బత్తి' లో తిమ్మాపురం అనే గ్రామాన్ని కధా కేంద్రంగా తీసుకుని ఆ ఊరిని, ఆ ఊరి చుట్టుపక్కల వున్న ఇరవై గ్రామాలను ఏలుతున్న నరహరిరావు అనే దొర (జమిందారు) పేద ప్రజల మీద జరుపుతున్న దోపిడీని, హింసను రచయిత చిత్రించాడు. నరహరిరావు జరుపుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు సంగం నాయకత్వంలో గొప్ప పోరాటం చేశారు. తెలంగాణా అంతటా జరిగిన అలాంటి పోరాటాల సమాహారమే తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంగా (1946 -51)నిలిచిపోయింది. నరహరిరావు గడీ మీద రాజన్న అనే పోరాట వీరుడు తన దళంతో దాడి చేసినప్పుడు, ఆ పోరాటంలో రాజన్న నరహరిరావు ఇద్దరూ చనిపోతారు. ఇది 'మలగని బత్తి' నవలలోని కధాంశం. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పిన నవల 'నేల జారని ఊడలు'. - ఎస్.ఎమ్. ప్రాణ్ రావ్© 2017,www.logili.com All Rights Reserved.