నిఘంటువు అంటే భాషలోని పదసమూహాన్ని ఒకచోట చేర్చి, ఆ పద స్వరూపమును, అర్ధవిశేషము లను, పర్యాయపదములను, సమానార్ధక పదములను తెల్పేది నిఘంటువని చెప్పుకోవచ్చు. ఈ నిఘంటువుకే కోశము, అనుశాసనము, అభిధానము అనే పర్యాయపదాలున్నాయి. ఈ నిఘంటువు అనే పదం ఇటీవల వచ్చిన పదం కాదు. ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే భారతదేశమున వేదకాలమునందే వైదిక నిఘంటువు ఉన్నదట.
బహుజన పల్లి సీతారామాచార్యులు రచించిన - ''శబ్ద రత్నాకరము'' అనే నిఘంటువు కు ఉన్న విశిష్టత ప్రత్యేకమైనది. అకారాది క్రమములో కూర్చబడిన మనిషి మరచిపోలేనటువంటి సామెతలు, మనిషి జీవన విధానానికి అవసరమైన సూక్తులు, భాషాప్రయో జనాలకు అనువైన జాతీయాలు, పద జ్ఞానాన్నిచ్చే పదసూచికలు చక్కగా తెలుస్తాయి. నిఘంటువును ఉపయోగించుకోవటం వలన అర్ధనిర్ణయము, వ్యాకరణ విషయములు, క్రియాపదాలు, విశేషణాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు వంటి ఎన్నో విషయాలు అందునా భాషకు చెందిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి.
ఇందులో అ నుండి హ వరకు శబ్దార్ధములు
పురాణం నామకోశం
పర్యాయపద కోశం
వ్యుత్పత్యర్ద కోశము
పారిభాషిక పదకోశం
నానార్ధకోశము
రూపాంతర కోశము
ప్రకృతి - వికృతి రూపకోశము
వికృతి - ప్రకృతి రూపకోశము
వ్యాకరణ పదకోశము
చందోపద - పద్య లక్షణ కోశం
ఏకాక్షర పద కోశం
నిఘంటువు అంటే భాషలోని పదసమూహాన్ని ఒకచోట చేర్చి, ఆ పద స్వరూపమును, అర్ధవిశేషము లను, పర్యాయపదములను, సమానార్ధక పదములను తెల్పేది నిఘంటువని చెప్పుకోవచ్చు. ఈ నిఘంటువుకే కోశము, అనుశాసనము, అభిధానము అనే పర్యాయపదాలున్నాయి. ఈ నిఘంటువు అనే పదం ఇటీవల వచ్చిన పదం కాదు. ఇది చాలా ప్రాచీనమైనది. ఎందుకంటే భారతదేశమున వేదకాలమునందే వైదిక నిఘంటువు ఉన్నదట. బహుజన పల్లి సీతారామాచార్యులు రచించిన - ''శబ్ద రత్నాకరము'' అనే నిఘంటువు కు ఉన్న విశిష్టత ప్రత్యేకమైనది. అకారాది క్రమములో కూర్చబడిన మనిషి మరచిపోలేనటువంటి సామెతలు, మనిషి జీవన విధానానికి అవసరమైన సూక్తులు, భాషాప్రయో జనాలకు అనువైన జాతీయాలు, పద జ్ఞానాన్నిచ్చే పదసూచికలు చక్కగా తెలుస్తాయి. నిఘంటువును ఉపయోగించుకోవటం వలన అర్ధనిర్ణయము, వ్యాకరణ విషయములు, క్రియాపదాలు, విశేషణాలు, దేశ్యాలు, అన్యదేశ్యాలు వంటి ఎన్నో విషయాలు అందునా భాషకు చెందిన ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. ఇందులో అ నుండి హ వరకు శబ్దార్ధములు పురాణం నామకోశం పర్యాయపద కోశం వ్యుత్పత్యర్ద కోశము పారిభాషిక పదకోశం నానార్ధకోశము రూపాంతర కోశము ప్రకృతి - వికృతి రూపకోశము వికృతి - ప్రకృతి రూపకోశము వ్యాకరణ పదకోశము చందోపద - పద్య లక్షణ కోశం ఏకాక్షర పద కోశం
© 2017,www.logili.com All Rights Reserved.