దూరం నుంచి కెరటాల చప్పుడు వినిపిస్తోంది...
అచ్చం జీవన సంగీతంలా...
ఎందుకు ఈ సంగీతాన్ని మీ అందరికీ వినిపించాలి?
ఎందుకు నా బతుకు ప్రయాణంలో ప్రతి అనుభవాన్నీ
మీ ముందుకు ఆవిష్కరించాలి?
నేనేమి అబ్దుల్ కలామ్ ని కాను...
అంబానీని కాను...
కేవలం ఓ సామాన్యుణ్ణి...
మరెందుకు ఈ సామాన్యుడి ఆత్మకధ మీకందించాలి?
ఎందుకంటే...
నా జీవితంలో ఏ చిన్న సంఘటనైనా...
ఏ మామూలు సందర్భమైనా...
ఏ మనసు తలుపు తట్టినా...
ఏ మనిషి వెన్ను తట్టినా...
ఎవరికీ కాసింత గుండె ఆర్తి తీర్చినా,
ఎవరికీ అణువంత స్పూర్తినిచ్చినా...
నా ఈ జీవితం సార్ధకమైనట్లే,
అర్ధాన్ని - పరమార్ధాన్ని సాధించినట్లే,
నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది.
ఇంకా ఎన్నో మైలురాళ్ళు - మేలు రాళ్ళు దాటాలని ఉంది...
ఔను నిజమే...
జీవిత ప్రయాణంలో
గెలుపు ఎప్పుడూ గమ్యం కాదు...
ఒక మజిలీ మాత్రమే!
- సాయినాథ్ పులిపాక
దూరం నుంచి కెరటాల చప్పుడు వినిపిస్తోంది... అచ్చం జీవన సంగీతంలా... ఎందుకు ఈ సంగీతాన్ని మీ అందరికీ వినిపించాలి? ఎందుకు నా బతుకు ప్రయాణంలో ప్రతి అనుభవాన్నీ మీ ముందుకు ఆవిష్కరించాలి? నేనేమి అబ్దుల్ కలామ్ ని కాను... అంబానీని కాను... కేవలం ఓ సామాన్యుణ్ణి... మరెందుకు ఈ సామాన్యుడి ఆత్మకధ మీకందించాలి? ఎందుకంటే... నా జీవితంలో ఏ చిన్న సంఘటనైనా... ఏ మామూలు సందర్భమైనా... ఏ మనసు తలుపు తట్టినా... ఏ మనిషి వెన్ను తట్టినా... ఎవరికీ కాసింత గుండె ఆర్తి తీర్చినా, ఎవరికీ అణువంత స్పూర్తినిచ్చినా... నా ఈ జీవితం సార్ధకమైనట్లే, అర్ధాన్ని - పరమార్ధాన్ని సాధించినట్లే, నా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. ఇంకా ఎన్నో మైలురాళ్ళు - మేలు రాళ్ళు దాటాలని ఉంది... ఔను నిజమే... జీవిత ప్రయాణంలో గెలుపు ఎప్పుడూ గమ్యం కాదు... ఒక మజిలీ మాత్రమే! - సాయినాథ్ పులిపాక© 2017,www.logili.com All Rights Reserved.