ఓ తాత ఇద్దరు మనవరాళ్ళు అమితా రే, స్వరణి. వారి గురించి ఆ తాత ఎన్నో కలలు కన్నాడు. తన మ్యూజింగ్స్ వారికి అందించాడు. అమెరికాలో ఉన్న స్వరణి చదువు మధ్యలో ఆపి అమ్మా నాన్నల్ని కాదని ఇండియా వచ్చేసింది. అక్కాచెల్లెళ్ళు తాత గుండెల్లో ఉన్న తీరని కోరికను గుర్తించారు. అప్పుడు వారేం చేశారు? ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
నవలని సాకల్యంగా చదివితే మనకు కూడా అనిపిస్తుంది - ఆజాద్ ఈ నవలని నూరుశతం మనసుపెట్టి, హృదయమంతటితో, నిజాయితీగా ప్రేమిస్తూ రచించారని! ఒక పెద్దమాట అంటాను. ఎవ్వరూ ఉలిక్కి పడనక్కర్లేదు. మనిషి బతుకు అంటే ఏమిటి? అదెలా ఉండాలి? అలాగే ఎందుకుండాలి? అనే పార్శ్వాల్నీ, ప్రశ్నల్నీ గురించి లోకంలో టన్నులకొద్దీ ఉన్న వాజ్మయంలోని సారాన్ని కాచి వడబోసి నిగ్గు తేల్చి చూపిన రచన ఈ నవల! ఆచరణాత్మక వేదాంతంలోని నిష్యంద సుధని కథనంగా వొలికించింది ఈ రచన! వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ ఔన్నత్యం అనే మూడు మాణిక్య భావనల నికషోపలం ఈ నవల!
ఓ తాత ఇద్దరు మనవరాళ్ళు అమితా రే, స్వరణి. వారి గురించి ఆ తాత ఎన్నో కలలు కన్నాడు. తన మ్యూజింగ్స్ వారికి అందించాడు. అమెరికాలో ఉన్న స్వరణి చదువు మధ్యలో ఆపి అమ్మా నాన్నల్ని కాదని ఇండియా వచ్చేసింది. అక్కాచెల్లెళ్ళు తాత గుండెల్లో ఉన్న తీరని కోరికను గుర్తించారు. అప్పుడు వారేం చేశారు? ఈ నవల చదివి తెలుసుకొనగలరు. నవలని సాకల్యంగా చదివితే మనకు కూడా అనిపిస్తుంది - ఆజాద్ ఈ నవలని నూరుశతం మనసుపెట్టి, హృదయమంతటితో, నిజాయితీగా ప్రేమిస్తూ రచించారని! ఒక పెద్దమాట అంటాను. ఎవ్వరూ ఉలిక్కి పడనక్కర్లేదు. మనిషి బతుకు అంటే ఏమిటి? అదెలా ఉండాలి? అలాగే ఎందుకుండాలి? అనే పార్శ్వాల్నీ, ప్రశ్నల్నీ గురించి లోకంలో టన్నులకొద్దీ ఉన్న వాజ్మయంలోని సారాన్ని కాచి వడబోసి నిగ్గు తేల్చి చూపిన రచన ఈ నవల! ఆచరణాత్మక వేదాంతంలోని నిష్యంద సుధని కథనంగా వొలికించింది ఈ రచన! వ్యక్తి నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ ఔన్నత్యం అనే మూడు మాణిక్య భావనల నికషోపలం ఈ నవల!© 2017,www.logili.com All Rights Reserved.