'విశ్వరూపునికో వైజయంతి'
కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ
కర మూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ అనే భావన భారతీయం. 'అయం మే హస్తః భగవాన్ అయం, అయం మే భగవత్తరః' అన్న భావన ఋగ్వేదీయం. 'అరచేతిలో వైకుంఠం' అని అధిక్షేపక లోకోక్తి. ఏది ఏమైనా మన జీవితమంతా అరచేతిలోనే ఉంది. అది అరచేయి ఎలా అయింది? సగం చేయి కాదు కదా! ఆలోచనీయమే. ఆ అరచేయే పూర్తి జీవితాన్ని తన గుప్పిట పెట్టుకోవడం ఆశ్చర్యకరం. అది విప్పి చెపుతాననడం శాస్త్రీయం. ఆ శాస్త్రాన్ని శాస్త్రీయ ధోరణిలో ఆకళింపు చేసుకున్న ఘనులు శ్రీమాన్ సేనాపతి దత్తా చార్యగారు. వీరెందరికో ఈ విద్యలో నైపుణ్యాన్ని అందించారు. మరెందరికో జీవన మార్గంలో మార్గాన్ని చూపించారు.
విష్ణుమూర్తి దగ్గర నుండి సకల దేవతల మహిమలూ అరచేతి రేఖల ద్వారానే సంకేతించబడినాయి. అటువంటి దైవ మహిమను వ్యక్తీకరించే దైవజ్ఞత సాముద్రికానికి ఉండడం విశేషమేమీ కాదు. ఆంజనేయుడంతటివాడు రాముని శరీరాన్ని సాముద్రికం ద్వారా వర్ణించాడు. అంటే, మన విద్యల గొప్పదనం అలాంటిది. నిజంగా ఆ రంగంలో కృషిచేస్తే పెళ్లికొడుకుని, పెళ్లి కూతురిని ఎంచుకోవడంలో ఆ శాస్త్రాన్ని వినియోగిస్తే పాణిగ్రహణ సమయంలో గ్రహించిన పాణులు విడివడవు. వైద్య సాముద్రికంలో కృషి సాగితే రాబోయే జబ్బులకు "నో ఎంట్రీ' బోర్ ముందే పెట్టవచ్చు. వైద్యము - సాముద్రికము కలిసి నేర్చుకున్న వైద్యుడు సమాజంలో నడయాడే దేవుడే. భారతీయ విద్యల గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు తన శారీరక, మానసిక శక్తులను, శ్రమను, కాలాన్ని ధారపోస్తున్న మహనీయులు శ్రీమాన్ దతాచార్యులవారు. వారిని అభినందిస్తూ వారి గురుత్వంలో మన విద్యారులంతా ఆ పూర్తప్రజ్ఞను సాధించి సాముద్రిక శాస్త్రం | యొక్క సముద్రమంతటి విస్తృతిని, ఆకాశమంత విస్తృతిగా వ్యాపింప జేయాలని సాముద్రిక వైజయంతి' విశ్వరూపి అయిన విష్ణువు కంఠమాలగా విశ్వవ్యాప్తం కావాలని మనసారా కోరుతున్నాను........
'విశ్వరూపునికో వైజయంతి' కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతీ కర మూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనమ్ అనే భావన భారతీయం. 'అయం మే హస్తః భగవాన్ అయం, అయం మే భగవత్తరః' అన్న భావన ఋగ్వేదీయం. 'అరచేతిలో వైకుంఠం' అని అధిక్షేపక లోకోక్తి. ఏది ఏమైనా మన జీవితమంతా అరచేతిలోనే ఉంది. అది అరచేయి ఎలా అయింది? సగం చేయి కాదు కదా! ఆలోచనీయమే. ఆ అరచేయే పూర్తి జీవితాన్ని తన గుప్పిట పెట్టుకోవడం ఆశ్చర్యకరం. అది విప్పి చెపుతాననడం శాస్త్రీయం. ఆ శాస్త్రాన్ని శాస్త్రీయ ధోరణిలో ఆకళింపు చేసుకున్న ఘనులు శ్రీమాన్ సేనాపతి దత్తా చార్యగారు. వీరెందరికో ఈ విద్యలో నైపుణ్యాన్ని అందించారు. మరెందరికో జీవన మార్గంలో మార్గాన్ని చూపించారు. విష్ణుమూర్తి దగ్గర నుండి సకల దేవతల మహిమలూ అరచేతి రేఖల ద్వారానే సంకేతించబడినాయి. అటువంటి దైవ మహిమను వ్యక్తీకరించే దైవజ్ఞత సాముద్రికానికి ఉండడం విశేషమేమీ కాదు. ఆంజనేయుడంతటివాడు రాముని శరీరాన్ని సాముద్రికం ద్వారా వర్ణించాడు. అంటే, మన విద్యల గొప్పదనం అలాంటిది. నిజంగా ఆ రంగంలో కృషిచేస్తే పెళ్లికొడుకుని, పెళ్లి కూతురిని ఎంచుకోవడంలో ఆ శాస్త్రాన్ని వినియోగిస్తే పాణిగ్రహణ సమయంలో గ్రహించిన పాణులు విడివడవు. వైద్య సాముద్రికంలో కృషి సాగితే రాబోయే జబ్బులకు "నో ఎంట్రీ' బోర్ ముందే పెట్టవచ్చు. వైద్యము - సాముద్రికము కలిసి నేర్చుకున్న వైద్యుడు సమాజంలో నడయాడే దేవుడే. భారతీయ విద్యల గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు తన శారీరక, మానసిక శక్తులను, శ్రమను, కాలాన్ని ధారపోస్తున్న మహనీయులు శ్రీమాన్ దతాచార్యులవారు. వారిని అభినందిస్తూ వారి గురుత్వంలో మన విద్యారులంతా ఆ పూర్తప్రజ్ఞను సాధించి సాముద్రిక శాస్త్రం | యొక్క సముద్రమంతటి విస్తృతిని, ఆకాశమంత విస్తృతిగా వ్యాపింప జేయాలని సాముద్రిక వైజయంతి' విశ్వరూపి అయిన విష్ణువు కంఠమాలగా విశ్వవ్యాప్తం కావాలని మనసారా కోరుతున్నాను........© 2017,www.logili.com All Rights Reserved.