2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా. ఎం.ఎస్.స్వామినాధన్, ప్రో.జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. ఆ కమిషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ఆ నివేదికలను పరిశీలించడానికి మంత్రులతో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ఉపసంఘాలు వేశారు, ఆ ఉపసంఘాలు, నివేదికలను ఆమోదిస్తూ అమలు చేపట్టాల్సిదింగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. పార్లమెంటు మరియు శాసనసభల్లో నివేదికలను అమలు జరపబోతున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, ఆచరణలో ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయినాయి.
కమిషన్ రిపోర్టులను అమలు చేస్తున్నామని రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం నివారించబడలేదు. పైగా మరింత ఉదృతమైనాయి. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు కొంత ఆదాయాన్ని సంపాదించుకొనేవారు. ఇప్పుడు ఆ అనుబంధ రంగాలు కూడా బహుళజాతి వ్యాపారుల దృష్టిలో పడ్డాయి. పాలు, కూరగాయాలు, చిల్లరవ్యాపారం కుటీర పరిశ్రమలు చేస్తున్నవారు ఉపాధి కోల్పోతున్నారు. దీనికి తోడు వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమ లేకపోవడం వల్ల మధ్యదళారీలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నారు. అందుకే, వ్యవసాయ రంగాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.
ఈ పుస్తకం అధ్యయనం చేయడం ద్వారా సమస్యలు అర్ధం చేసుకొని వాటిని సాధించుకోవడానికి సంఘటిత ఉద్యమం నిర్మిస్తారని ఆశిస్తున్నాను.
- సారంపల్లి మల్లారెడ్డి
2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా. ఎం.ఎస్.స్వామినాధన్, ప్రో.జయతిఘోష్, జస్టిస్ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. ఆ కమిషన్లు నిర్ణీత కాలానికి ముందే తమ నివేదికలను ఇచ్చాయి. ఆ నివేదికలను పరిశీలించడానికి మంత్రులతో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ఉపసంఘాలు వేశారు, ఆ ఉపసంఘాలు, నివేదికలను ఆమోదిస్తూ అమలు చేపట్టాల్సిదింగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. పార్లమెంటు మరియు శాసనసభల్లో నివేదికలను అమలు జరపబోతున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, ఆచరణలో ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయినాయి. కమిషన్ రిపోర్టులను అమలు చేస్తున్నామని రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు పదే పదే చెబుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం నివారించబడలేదు. పైగా మరింత ఉదృతమైనాయి. వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతులు కొంత ఆదాయాన్ని సంపాదించుకొనేవారు. ఇప్పుడు ఆ అనుబంధ రంగాలు కూడా బహుళజాతి వ్యాపారుల దృష్టిలో పడ్డాయి. పాలు, కూరగాయాలు, చిల్లరవ్యాపారం కుటీర పరిశ్రమలు చేస్తున్నవారు ఉపాధి కోల్పోతున్నారు. దీనికి తోడు వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమ లేకపోవడం వల్ల మధ్యదళారీలు వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా విపరీతంగా లాభాలు సంపాదిస్తున్నారు. అందుకే, వ్యవసాయ రంగాన్ని లోతుగా అధ్యయనం చేయాలి. ఈ పుస్తకం అధ్యయనం చేయడం ద్వారా సమస్యలు అర్ధం చేసుకొని వాటిని సాధించుకోవడానికి సంఘటిత ఉద్యమం నిర్మిస్తారని ఆశిస్తున్నాను. - సారంపల్లి మల్లారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.