నీకు తెలిసిందంతా కేవలం నమ్మటం. ఆ నమ్మకం హాయిగా వుంటే సుఖంగా వుంటే చాలు..... నిజంతో నీకేం పని ? నీ చిన్నిస్వార్ధం తృప్తిపడితే చాలు. నెలకు ఒక ఇరవైవేలోస్తే చాలు"
...... రమణజీవి
" కొండలు వాగులు చెట్టు చేమలు ఇతర జంతువులు ఉన్న పర్యావరణంలో మనిషి కూడా ఒక జీవి. మనిషిని ఈ నేపధ్యం నుంచి విడదీసి చూడకూడదు" అంటాడు అమెరికన్ రచయిత జాన్ స్టీన్ బెక్. ప్రకృతి నుంచి మనిషిని విడదీస్తే ఏ విపరిణామాలు చోటుచేసుకుంటాయో రమణజీవి తనదైన శైలిలో చెప్పిన కధలివి. వీటికి పోస్ట్ మోడ్రన్ మాజికల్ రియలిజం ధోరణులు ప్రధాన వాహికలు. స్త్రీ గొంతుతో చెప్పిన కధల్లో బీభత్సరసం వెనుకవున్న విషాద నేపధ్యం కూడా నడుస్తున్న చరిత్రే ! ఇటువంటి ప్రతిభనే శ్రీశ్రీ 'రసన' అన్నాడు.
చైతన్య అస్తిత్వం అనికాక చైతన్యాన్ని అస్తిత్వాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటాడు రచయిత. మనిషిలో స్ప్లిట్ పర్సనలిటితో కొనసాగే దబాయింపు జీవితాలను ' ఫ్రేము'లోంచి నిర్ధాక్షిణ్యంగా బయటికి లాగుతుంటాడు. హృదయాన్ని మేధస్సును ఏకకాలంలో కల్లోలపరిచే అధివాస్తవిక, ఆధునికానంతర, ఐంద్రజాలిక విలక్షణ కధనమే రమణజీవి ...... సింహాల పేట.
....... ఆర్ కె
ఫ్రేముల్లో ఇమడని కథలు
'నువ్వు దేన్నీ కొలవొద్దు ఇక్కడ. నీకు చాలా తెలుసనుకుంటున్నట్టుంది, రాత్రీపగళ్ల గురించి. నీకు తెలిసిందాంట్లో నిజం శాతం ఎంతో నీకు తెలీదు. పైకి విసిరిన వస్తువు కిందికే ఎందుకు పడుతుందో తెలుసా? గురుత్వాకర్షణ అనుకుంటావు, అదీ ఎవరో చెప్పగా విని. పిచ్చివాడా, అది ఆకర్షణ కాదు. ప్రేమ అంటే ఏమవుతావు? నీకు దుఃఖం ఎక్కణ్నుంచి వస్తుందో తెలుసా? ఆనం దం ఎక్కణ్నుంచి వస్తుందో... ఆశ్చర్యం... కోరిక.. భయం... నిద్ర.. మర ణం...' ఇట్లా సాగుతుంది ఒక పాత్ర ధోరణి ఒక కథలో.
కానీ రమణజీవి కథలన్నిటికీ ఇదే మూలసూత్రం. ఏది - ఎందుకు - ఎలా - ఎక్కడికి - అన్న అన్వేషణే ఆయన కథలను కలిపే కేంద్రం. పర్యావరణం, సైన్సు, తాత్వికత, మానవత అనే నాలుగూ కలిసిన సంగమం కనిపిస్తుందీ కథల్లో. సంకలనంలో ఉన్నవి పన్నెండు కథలే గాని పన్నెండు వందల జీవితాలను చదివిన అనుభూతినిస్తాయి. ముఖ్యంగా 'సముద్రం', 'రేయ్ సుంకన్నా' ఈ పుస్తకానికి కిరీటంలాగా అమరిన కథలు.
- ఆదివారం ఆంధ్రజ్యోతి
నీకు తెలిసిందంతా కేవలం నమ్మటం. ఆ నమ్మకం హాయిగా వుంటే సుఖంగా వుంటే చాలు..... నిజంతో నీకేం పని ? నీ చిన్నిస్వార్ధం తృప్తిపడితే చాలు. నెలకు ఒక ఇరవైవేలోస్తే చాలు" ...... రమణజీవి " కొండలు వాగులు చెట్టు చేమలు ఇతర జంతువులు ఉన్న పర్యావరణంలో మనిషి కూడా ఒక జీవి. మనిషిని ఈ నేపధ్యం నుంచి విడదీసి చూడకూడదు" అంటాడు అమెరికన్ రచయిత జాన్ స్టీన్ బెక్. ప్రకృతి నుంచి మనిషిని విడదీస్తే ఏ విపరిణామాలు చోటుచేసుకుంటాయో రమణజీవి తనదైన శైలిలో చెప్పిన కధలివి. వీటికి పోస్ట్ మోడ్రన్ మాజికల్ రియలిజం ధోరణులు ప్రధాన వాహికలు. స్త్రీ గొంతుతో చెప్పిన కధల్లో బీభత్సరసం వెనుకవున్న విషాద నేపధ్యం కూడా నడుస్తున్న చరిత్రే ! ఇటువంటి ప్రతిభనే శ్రీశ్రీ 'రసన' అన్నాడు. చైతన్య అస్తిత్వం అనికాక చైతన్యాన్ని అస్తిత్వాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయంటాడు రచయిత. మనిషిలో స్ప్లిట్ పర్సనలిటితో కొనసాగే దబాయింపు జీవితాలను ' ఫ్రేము'లోంచి నిర్ధాక్షిణ్యంగా బయటికి లాగుతుంటాడు. హృదయాన్ని మేధస్సును ఏకకాలంలో కల్లోలపరిచే అధివాస్తవిక, ఆధునికానంతర, ఐంద్రజాలిక విలక్షణ కధనమే రమణజీవి ...... సింహాల పేట. ....... ఆర్ కె ఫ్రేముల్లో ఇమడని కథలు'నువ్వు దేన్నీ కొలవొద్దు ఇక్కడ. నీకు చాలా తెలుసనుకుంటున్నట్టుంది, రాత్రీపగళ్ల గురించి. నీకు తెలిసిందాంట్లో నిజం శాతం ఎంతో నీకు తెలీదు. పైకి విసిరిన వస్తువు కిందికే ఎందుకు పడుతుందో తెలుసా? గురుత్వాకర్షణ అనుకుంటావు, అదీ ఎవరో చెప్పగా విని. పిచ్చివాడా, అది ఆకర్షణ కాదు. ప్రేమ అంటే ఏమవుతావు? నీకు దుఃఖం ఎక్కణ్నుంచి వస్తుందో తెలుసా? ఆనం దం ఎక్కణ్నుంచి వస్తుందో... ఆశ్చర్యం... కోరిక.. భయం... నిద్ర.. మర ణం...' ఇట్లా సాగుతుంది ఒక పాత్ర ధోరణి ఒక కథలో.కానీ రమణజీవి కథలన్నిటికీ ఇదే మూలసూత్రం. ఏది - ఎందుకు - ఎలా - ఎక్కడికి - అన్న అన్వేషణే ఆయన కథలను కలిపే కేంద్రం. పర్యావరణం, సైన్సు, తాత్వికత, మానవత అనే నాలుగూ కలిసిన సంగమం కనిపిస్తుందీ కథల్లో. సంకలనంలో ఉన్నవి పన్నెండు కథలే గాని పన్నెండు వందల జీవితాలను చదివిన అనుభూతినిస్తాయి. ముఖ్యంగా 'సముద్రం', 'రేయ్ సుంకన్నా' ఈ పుస్తకానికి కిరీటంలాగా అమరిన కథలు. - ఆదివారం ఆంధ్రజ్యోతి
© 2017,www.logili.com All Rights Reserved.