ఆచరణే భోధనగా అవతరించిన అవధూత సాయి నాధుడు. సమున్నత గురుపరంపరలో అయన ఓ గౌరీశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంధాల్ని పరిశీలించి, సాయి అవతారాన్ని, సద్గురు జీవిత విశేషాల్ని గుచ్చేత్తిన సైపుణ్యం ఉంది. ఆధ్యాత్మికం అనగానే కొండెక్కి కూర్చోకుండా చదువరుల హృదయాలను చేరువగా వెళ్ళాలన్న తపన, తపస్సాధన సాయిబాబా సన్నివేశాల సృజనలో స్పష్టంగా కనిపిస్తాయి. 'నవ్యవీక్లీ' లో ముప్పయి మూడు వారాలపాటు పాఠకుల్ని రంజింప చేసిన ఈ ధారావాహికను రాసిన 'శివసతీపురం శర్మ' మరెవరో కాదు. అరణి, అనీలజ, లహరి వంటి కలం పేర్లతో అద్బుతంగా రాస్తున్న ప్రముఖ కధా రచయిత జగన్నాధ శర్మే! ఇందులోని శైలీ శిల్పాల మీద వారి సంతకం స్పష్టంగా కనిపిస్తుంది.
పాటకుల్ని గుక్క తిప్పకోనివ్వకుండా చదివిస్తూ, సాయి తత్వాన్ని సరికొత్త కోణంలో సందర్శింపజేసే మంచి పుస్తకాల్లో ఇది ఒకటి. సాయి భక్తులు దీనిని తప్పకుండా చదవాలి.
వారం వారం సాయి పారాయణం మనల్ని మనం తెలుసుకునేందుకు, మనిషిగా బతికేందుకు ఉపకరిస్తుంది.
ఆచరణే భోధనగా అవతరించిన అవధూత సాయి నాధుడు. సమున్నత గురుపరంపరలో అయన ఓ గౌరీశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంధాల్ని పరిశీలించి, సాయి అవతారాన్ని, సద్గురు జీవిత విశేషాల్ని గుచ్చేత్తిన సైపుణ్యం ఉంది. ఆధ్యాత్మికం అనగానే కొండెక్కి కూర్చోకుండా చదువరుల హృదయాలను చేరువగా వెళ్ళాలన్న తపన, తపస్సాధన సాయిబాబా సన్నివేశాల సృజనలో స్పష్టంగా కనిపిస్తాయి. 'నవ్యవీక్లీ' లో ముప్పయి మూడు వారాలపాటు పాఠకుల్ని రంజింప చేసిన ఈ ధారావాహికను రాసిన 'శివసతీపురం శర్మ' మరెవరో కాదు. అరణి, అనీలజ, లహరి వంటి కలం పేర్లతో అద్బుతంగా రాస్తున్న ప్రముఖ కధా రచయిత జగన్నాధ శర్మే! ఇందులోని శైలీ శిల్పాల మీద వారి సంతకం స్పష్టంగా కనిపిస్తుంది. పాటకుల్ని గుక్క తిప్పకోనివ్వకుండా చదివిస్తూ, సాయి తత్వాన్ని సరికొత్త కోణంలో సందర్శింపజేసే మంచి పుస్తకాల్లో ఇది ఒకటి. సాయి భక్తులు దీనిని తప్పకుండా చదవాలి. వారం వారం సాయి పారాయణం మనల్ని మనం తెలుసుకునేందుకు, మనిషిగా బతికేందుకు ఉపకరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.