ఈ క్రింది 4 శతకాల పుస్తకాన్ని టీకా, తాత్పర్యంతో సహా సవివరంగా పాఠకలోకానికి అందిస్తున్నాం. అవి - 'సుమతీ శతకం', 'వేమన శతకం', 'కుమార శతకం', 'కుమారీ శతకం'.
మనకు ప్రామాణిక గ్రంధాలైన భగవద్గీత, కావ్యాలు, ప్రబందాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో వున్న సమాచారం మరియు వాటి గొప్పతనం కొంచెం భాషా పరిచయం ఉన్నవారికి కానీ అర్ధంకావు. అంతటి పాండిత్యం కలవారు మనలో చాలా తక్కువమంది ఉంటారనేది అక్షర సత్యం. ప్రామాణిక గ్రంధాలలో ఉన్న సమాచారమంతా పై నాలుగు శతకాలలో ఉన్నాయి. పండితులే కాక పామరులకు సహితం అర్ధమయ్యే రీతిలో సగటు పాఠకుని స్థాయికి దిగి సమాజం ముందు ఉంచారు, సామాజిక స్పృహ గల మన పూర్వ కవులు. ప్రతి పద్యంలో 4 లైన్లు - ప్రతి లైనులో ఒక నీతో, నియమమో, ఒక చేయతగిన పనో మరియు ఒక చేయతగిన పనో, ఇలా విశదీకరించడమైనది. కవి పద్యంలో చెప్పే ప్రతి ఒక్క నీతి వెనుక ఒక జీవితకాలపు అనుభవం తొంగి చూస్తుంది గమనించండి.
బంగారానికి తావి అబ్బినట్లు, ఈ పద్యాలకు తనదైన శైలిలో, తేటతెలుగులో టీకాతాత్పర్యాలను చేకూర్చారు - శ్రీ మొక్కపాటి శర్మగారు. పిల్లలతో కంఠస్తం చేయించదగిన ఈ పద్యాల పుస్తకం తెలుగునాట ప్రతి ఇంటా ఉంచదగినది. కనీసం కొన్ని నీతులైనా బాల, బాలికల మనుసులో నాటుకుంటే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే!
- శ్రీ మొక్కపాటి శర్మ
ఈ క్రింది 4 శతకాల పుస్తకాన్ని టీకా, తాత్పర్యంతో సహా సవివరంగా పాఠకలోకానికి అందిస్తున్నాం. అవి - 'సుమతీ శతకం', 'వేమన శతకం', 'కుమార శతకం', 'కుమారీ శతకం'. మనకు ప్రామాణిక గ్రంధాలైన భగవద్గీత, కావ్యాలు, ప్రబందాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో వున్న సమాచారం మరియు వాటి గొప్పతనం కొంచెం భాషా పరిచయం ఉన్నవారికి కానీ అర్ధంకావు. అంతటి పాండిత్యం కలవారు మనలో చాలా తక్కువమంది ఉంటారనేది అక్షర సత్యం. ప్రామాణిక గ్రంధాలలో ఉన్న సమాచారమంతా పై నాలుగు శతకాలలో ఉన్నాయి. పండితులే కాక పామరులకు సహితం అర్ధమయ్యే రీతిలో సగటు పాఠకుని స్థాయికి దిగి సమాజం ముందు ఉంచారు, సామాజిక స్పృహ గల మన పూర్వ కవులు. ప్రతి పద్యంలో 4 లైన్లు - ప్రతి లైనులో ఒక నీతో, నియమమో, ఒక చేయతగిన పనో మరియు ఒక చేయతగిన పనో, ఇలా విశదీకరించడమైనది. కవి పద్యంలో చెప్పే ప్రతి ఒక్క నీతి వెనుక ఒక జీవితకాలపు అనుభవం తొంగి చూస్తుంది గమనించండి. బంగారానికి తావి అబ్బినట్లు, ఈ పద్యాలకు తనదైన శైలిలో, తేటతెలుగులో టీకాతాత్పర్యాలను చేకూర్చారు - శ్రీ మొక్కపాటి శర్మగారు. పిల్లలతో కంఠస్తం చేయించదగిన ఈ పద్యాల పుస్తకం తెలుగునాట ప్రతి ఇంటా ఉంచదగినది. కనీసం కొన్ని నీతులైనా బాల, బాలికల మనుసులో నాటుకుంటే మా ఈ ప్రయత్నం ఫలించినట్లే! - శ్రీ మొక్కపాటి శర్మ
© 2017,www.logili.com All Rights Reserved.