తెలుగు చిత్రకళా విమర్శలో ఇది ఒక కొత్తకోణం. సుప్రసిద్ధ చిత్రకారుల జీవనరేఖల్ని పరిచయం చేయడం కాదు. ఆ రేఖల నడుమగల అంశాల్ని సూక్ష్మదృష్టి తో చూడటం విమర్శకునిగా వెంకటరమణ సాధించిన సౌఫల్యం. మనోవైజ్ఞానిక సిద్దాంతాలను, ఫ్రాయిడ్ ఆలోచనలని చిత్రకళా ప్రపంచానికి ఎలా అనువర్తింప జేయవచ్చునో సోదాహరణంగా చెప్పారు. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన స్వప్న ప్రతీకలకీ, డాలి చిత్రాలకి నడుమ వున్న సంబంధం ఏమిటో వెంకట రమణ చర్చించారు. తెలుగులో ఈ దృష్టికోణంతో చిత్రకళా విమర్శ రావడం అరుదు. కనుకనే లియోనార్డీ డావిన్సి , పికాసో, రాఫెల్, రెంబ్రాంట్, పాల్ గాగిన్, జార్జియా ఓ కాఫే ... మొదలగు వారి గురించి రాసిన వ్యాసాలు, చేసిన విశ్లేషణలు కొత్తదనం తో కూడివున్నాయి. బొమ్మలు గీయడంలో వ్యాంగో జీవితంలో విషాద భీభత్సానికి, అతని చిత్రాల్లోని రంగులకీ గల సంబంధాన్ని విశ్లేషించారు వెంకట రమణ
తెలుగు చిత్రకళా విమర్శలో ఇది ఒక కొత్తకోణం. సుప్రసిద్ధ చిత్రకారుల జీవనరేఖల్ని పరిచయం చేయడం కాదు. ఆ రేఖల నడుమగల అంశాల్ని సూక్ష్మదృష్టి తో చూడటం విమర్శకునిగా వెంకటరమణ సాధించిన సౌఫల్యం. మనోవైజ్ఞానిక సిద్దాంతాలను, ఫ్రాయిడ్ ఆలోచనలని చిత్రకళా ప్రపంచానికి ఎలా అనువర్తింప జేయవచ్చునో సోదాహరణంగా చెప్పారు. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన స్వప్న ప్రతీకలకీ, డాలి చిత్రాలకి నడుమ వున్న సంబంధం ఏమిటో వెంకట రమణ చర్చించారు. తెలుగులో ఈ దృష్టికోణంతో చిత్రకళా విమర్శ రావడం అరుదు. కనుకనే లియోనార్డీ డావిన్సి , పికాసో, రాఫెల్, రెంబ్రాంట్, పాల్ గాగిన్, జార్జియా ఓ కాఫే ... మొదలగు వారి గురించి రాసిన వ్యాసాలు, చేసిన విశ్లేషణలు కొత్తదనం తో కూడివున్నాయి. బొమ్మలు గీయడంలో వ్యాంగో జీవితంలో విషాద భీభత్సానికి, అతని చిత్రాల్లోని రంగులకీ గల సంబంధాన్ని విశ్లేషించారు వెంకట రమణ© 2017,www.logili.com All Rights Reserved.