ఆ పదం వింటేనే ఇన్వెస్టరర్ల మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. కొంతమంది నిద్రలో సైతం షేర్లను కలవరిస్తుంటే, మరి కొంతమంది 'అమ్మో! అది రిస్క్ గేమ్! దాని జోలికి వెళ్ళకూడదు' అని భయపడుతుంటారు. అలా స్టాక్ మార్కెట్ కీ రెండు వైపులా పదును వుంది.
తెలుగులో 'స్టాక్ మార్కేట్' మీద మా పబ్లికేషన్ ద్వారా వెలువడిన రెండవ పుస్తకమే ప్రస్తుతపు ఈ పుస్తకం. స్టాక్ మార్కేట్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇంకా పుస్తకాలు ప్రచురించమని కోరారు. దురదృష్టవశాత్తు తెలుగులో 'స్టాక్ మార్కేట్' మీద పుస్తకాలు లేవు. అందువల్ల వారి కోరిక మేరకే ఈ పుస్తకం ప్రచురించడం జరిగింది.
ఇటివల అమెరికా సబ్ ప్రైమ్ ప్రభావంతో 7000దాకా పడిపోయిన సెన్సెస్ ఆర్ధిక రంగం కోలుకోనుందన్న వార్తలతో తిరిగి 12,000దాకా పెరిగింది. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలలో కేంద్రం సుస్థిర ప్రభుత్వం వచ్చిందన్న వార్తలతో ఇండెక్స్ రెక్కలు విరుచుకొని వాయు వేగంతో కదలసాగింది.
అయితే వాపును చూసి 'బలుపు' అనుకోకూడదు. ఇప్పటికి అమెరికా ఆర్ధిక మాంద్యంతో విలవిలలాడుతోంది. ఇతర ఐరోపా దేశాలు ఆర్ధిక విపత్తులతో కదలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ మార్కేట్ పెరగడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అందుకే మార్కేట్ పెరుగుతోంది కదాని ఏదోక షేర్ ని కొని చేతులు కాల్చుకోకుండా ఫండమెంటల్ గా పటిష్టంగా ఉన్న షేర్లను కొనాలి.
అందుకే ఈ పుస్తకంలో సరికొత్త టెక్నిక్ లైన ప్యూచర్స్ & ఆప్షన్స్, కమోడిటిస్ మార్కెట్, టెక్నికల్ ఎనాల్సిన్ ల గురించి వివరంగా వివరించం. వీటితోపాటు ఆన్ లైన్ ట్రేడింగ్ లాంటి సరికొత్త విషయాలు చర్చించాం.
ఇదే కాక షేర్ మార్కేట్ లో ఎక్కువ మందిఎదుర్కొనే సమస్య నష్టాలు రావడం. ఈ షేర్ నష్టాలను గణనీయంగా తగ్గించే మహత్తర సాధనమైన 'స్టాప్ లాస్' (Stop Loss) గురించి సుదీర్ఘంగా వివరించాం. పై టాపిక్ లు మీకు స్టాక్ మార్కెట్ లో నష్టాలను ఎదుర్కోవడానికి చాలా వరకు సహాయపడతాయని మేము భావిస్తున్నాం.
- డా.కె. కిరణ్ కుమార్
ఆ పదం వింటేనే ఇన్వెస్టరర్ల మనసు ఉద్వేగంతో నిండిపోతుంది. కొంతమంది నిద్రలో సైతం షేర్లను కలవరిస్తుంటే, మరి కొంతమంది 'అమ్మో! అది రిస్క్ గేమ్! దాని జోలికి వెళ్ళకూడదు' అని భయపడుతుంటారు. అలా స్టాక్ మార్కెట్ కీ రెండు వైపులా పదును వుంది. తెలుగులో 'స్టాక్ మార్కేట్' మీద మా పబ్లికేషన్ ద్వారా వెలువడిన రెండవ పుస్తకమే ప్రస్తుతపు ఈ పుస్తకం. స్టాక్ మార్కేట్ గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇంకా పుస్తకాలు ప్రచురించమని కోరారు. దురదృష్టవశాత్తు తెలుగులో 'స్టాక్ మార్కేట్' మీద పుస్తకాలు లేవు. అందువల్ల వారి కోరిక మేరకే ఈ పుస్తకం ప్రచురించడం జరిగింది. ఇటివల అమెరికా సబ్ ప్రైమ్ ప్రభావంతో 7000దాకా పడిపోయిన సెన్సెస్ ఆర్ధిక రంగం కోలుకోనుందన్న వార్తలతో తిరిగి 12,000దాకా పెరిగింది. అదే సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలలో కేంద్రం సుస్థిర ప్రభుత్వం వచ్చిందన్న వార్తలతో ఇండెక్స్ రెక్కలు విరుచుకొని వాయు వేగంతో కదలసాగింది. అయితే వాపును చూసి 'బలుపు' అనుకోకూడదు. ఇప్పటికి అమెరికా ఆర్ధిక మాంద్యంతో విలవిలలాడుతోంది. ఇతర ఐరోపా దేశాలు ఆర్ధిక విపత్తులతో కదలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారతీయ మార్కేట్ పెరగడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అందుకే మార్కేట్ పెరుగుతోంది కదాని ఏదోక షేర్ ని కొని చేతులు కాల్చుకోకుండా ఫండమెంటల్ గా పటిష్టంగా ఉన్న షేర్లను కొనాలి. అందుకే ఈ పుస్తకంలో సరికొత్త టెక్నిక్ లైన ప్యూచర్స్ & ఆప్షన్స్, కమోడిటిస్ మార్కెట్, టెక్నికల్ ఎనాల్సిన్ ల గురించి వివరంగా వివరించం. వీటితోపాటు ఆన్ లైన్ ట్రేడింగ్ లాంటి సరికొత్త విషయాలు చర్చించాం. ఇదే కాక షేర్ మార్కేట్ లో ఎక్కువ మందిఎదుర్కొనే సమస్య నష్టాలు రావడం. ఈ షేర్ నష్టాలను గణనీయంగా తగ్గించే మహత్తర సాధనమైన 'స్టాప్ లాస్' (Stop Loss) గురించి సుదీర్ఘంగా వివరించాం. పై టాపిక్ లు మీకు స్టాక్ మార్కెట్ లో నష్టాలను ఎదుర్కోవడానికి చాలా వరకు సహాయపడతాయని మేము భావిస్తున్నాం. - డా.కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.