రకరకాల విద్యార్ధులు రకరకాలుగా చదవుతారు. చదవులో ఒక్కొక్కరిదీ ఒక్కోశైలి. కాలేజిలో లెక్చరర్లు పాఠాలు చెబుతారు కాని ఎలా చదవాలో చెప్పరు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు స్టడీ టెక్నిక్ లు తెలియవు. చాలామంది తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలలో, వృత్తుల్లో, వ్యాపారాలలో బిజీగా వుంటారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేయాలంటే వారికి సమయం ఉండదు. కాలేజివారే ఏదో చెబుతున్నారు కదా అని వదిలేస్తారు.
అందుకే ఎంసెట్ మీద అద్భుత టెక్నిక్ లు గల పుస్తకం వుండాలని చాలామంది వ్యక్తం చేయడంతో రచయిత ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ పుస్తకం చదివితే మీరే స్టేట్ ర్యాంక్ నెంబర్ వన్ అని మేము చెప్పడం లేదు. కనీసం 1000 -2000 లోపు ర్యాంకు రావడానికి అవకాశం ఉంటుందని మాత్రం చెప్పగలం. ఇందులో విద్యార్ధులకు ఉత్తేజపరిచే టెక్నిక్ లు, పద్ధతులు చాలా వున్నాయి.
ఈ పుస్తకం మీకు ఎంసెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా చదివితే మీ సమయం సద్వినియోగమవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది.
ఈ పుస్తక రచన కోసం రచయిత కొన్ని వందల మంది విద్యార్ధులను ఇంటర్వ్యూ చేశారు. వారిలో స్టేట్ ర్యాంకర్లు వున్నారు. ఎంసెట్ లో ర్యాంక్ రాని వారూ ఉన్నారు. ర్యాంకు వచ్చిన వారిని ఆ ర్యాంకు ఎలా వచ్చిందో, రాని వారిని ఎక్కడ పొరబాటు చేశారో కనుకున్నారు. అలా ఈ పుస్తకం వెనకాల చాలా శ్రమ వుంది. కేవలం టెక్నిక్ లు రాస్తే సరిపోదు. వాటిని ఆసక్తికరంగా చదివించడానికి బలమైన శైలి వుండాలి. అలాంటి బలమైన శైలి, అద్భుత టెక్నిక్ లు గురించి వివరించడానికి డా. కె. కిరణ్ కుమార్ ని ఎన్నుకున్నాం. డా.కె. కిరణ్ కుమార్ ఇప్పటికే నవలా రచయితగా, కంప్యూటర్ పుస్తాకాల రచయితగా ప్రఖ్యాతి గాంచారు. బలమైన శైలి, లోతైన విశ్లేషణ, హృదయానికి హత్తుకునేటట్లు చెప్పగల విధానంతో పాటు మరో అదనపు ఆకర్షణ ఏమిటంటే ఈ రచయిత లెక్చరర్ కూడా కావడంతో విద్యార్ధుల మనస్తత్వం బాగా ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది.
ఈ పుస్తకంలో అనేక అధ్యాయాలుగా విడగొట్టి రకరకాల టెక్నిక్ లు ఇచ్చాం. మీరూ ఆయా అధ్యాయాల టెక్నిక్ లను అనుసరిస్తారని ఆశిస్తూ...
- డా. కె. కిరణ్ కుమార్
రకరకాల విద్యార్ధులు రకరకాలుగా చదవుతారు. చదవులో ఒక్కొక్కరిదీ ఒక్కోశైలి. కాలేజిలో లెక్చరర్లు పాఠాలు చెబుతారు కాని ఎలా చదవాలో చెప్పరు. ముఖ్యంగా చాలామంది తల్లిదండ్రులకు స్టడీ టెక్నిక్ లు తెలియవు. చాలామంది తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగాలలో, వృత్తుల్లో, వ్యాపారాలలో బిజీగా వుంటారు. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం చేయాలంటే వారికి సమయం ఉండదు. కాలేజివారే ఏదో చెబుతున్నారు కదా అని వదిలేస్తారు. అందుకే ఎంసెట్ మీద అద్భుత టెక్నిక్ లు గల పుస్తకం వుండాలని చాలామంది వ్యక్తం చేయడంతో రచయిత ఆ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ పుస్తకం చదివితే మీరే స్టేట్ ర్యాంక్ నెంబర్ వన్ అని మేము చెప్పడం లేదు. కనీసం 1000 -2000 లోపు ర్యాంకు రావడానికి అవకాశం ఉంటుందని మాత్రం చెప్పగలం. ఇందులో విద్యార్ధులకు ఉత్తేజపరిచే టెక్నిక్ లు, పద్ధతులు చాలా వున్నాయి. ఈ పుస్తకం మీకు ఎంసెట్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలా చదివితే మీ సమయం సద్వినియోగమవుతుందో, ఎలా రాస్తే అత్యధిక మార్కులు వస్తాయో తెలుపుతుంది. ఈ పుస్తక రచన కోసం రచయిత కొన్ని వందల మంది విద్యార్ధులను ఇంటర్వ్యూ చేశారు. వారిలో స్టేట్ ర్యాంకర్లు వున్నారు. ఎంసెట్ లో ర్యాంక్ రాని వారూ ఉన్నారు. ర్యాంకు వచ్చిన వారిని ఆ ర్యాంకు ఎలా వచ్చిందో, రాని వారిని ఎక్కడ పొరబాటు చేశారో కనుకున్నారు. అలా ఈ పుస్తకం వెనకాల చాలా శ్రమ వుంది. కేవలం టెక్నిక్ లు రాస్తే సరిపోదు. వాటిని ఆసక్తికరంగా చదివించడానికి బలమైన శైలి వుండాలి. అలాంటి బలమైన శైలి, అద్భుత టెక్నిక్ లు గురించి వివరించడానికి డా. కె. కిరణ్ కుమార్ ని ఎన్నుకున్నాం. డా.కె. కిరణ్ కుమార్ ఇప్పటికే నవలా రచయితగా, కంప్యూటర్ పుస్తాకాల రచయితగా ప్రఖ్యాతి గాంచారు. బలమైన శైలి, లోతైన విశ్లేషణ, హృదయానికి హత్తుకునేటట్లు చెప్పగల విధానంతో పాటు మరో అదనపు ఆకర్షణ ఏమిటంటే ఈ రచయిత లెక్చరర్ కూడా కావడంతో విద్యార్ధుల మనస్తత్వం బాగా ఆకళింపు చేసుకునే అవకాశం కలిగింది. ఈ పుస్తకంలో అనేక అధ్యాయాలుగా విడగొట్టి రకరకాల టెక్నిక్ లు ఇచ్చాం. మీరూ ఆయా అధ్యాయాల టెక్నిక్ లను అనుసరిస్తారని ఆశిస్తూ... - డా. కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.