ఈ సూక్తులు ప్రాచీనకాలపు మహాకవుల గ్రంథమునుండి సంగ్రహింపబడినవి. ఆ కవులు లోకజ్ఞులై మానవుని వ్యక్తిరూపమును, వానిద్వారా సంఘమును దీర్చిదిద్దుటకు చక్కని సూక్తులు ప్రసాదించియున్నారు. కాన నీ పుస్తకమునకు నిడిన పేరు సార్థకము. ఇందు నిత్యవ్యవహారములలో నుదహరింపదగినవియు, మనస్సునకు బుద్ధికిని ఆత్మకును వికాసమును శుద్ధిని గూర్చు సూక్తులు వేలకు మించి యున్నవి. మృదుమధుర భాషలో వ్రాయబడి యుండుటచే చదువుటకును ధారణ చేయుటకును వీలుగా నున్నవి.
"నిత్యజీవితంలో ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సూక్తిని ఉదాహరించడానికి, చేతనైతే ఆ విధంగా నడుచుకోడానికి, అదివరకే ఆ ప్రకారం చేసివుంటే దాన్ని సమర్ధించుకోడానికి ఇట్టి సూక్తులు పనికివస్తాయి... ఇటువంటివి గ్రంథరూపంలో ప్రచురించేటపుడు కేవలం సూక్తిలోని విషయాన్నిబట్టి గాక ఉక్తివైచిత్రిని బట్టి కూడా ఎంచుకోవాలి... సంస్కృత వాజ్మయంనుంచి సేకరించిన సుభాషితాలతో శ్రీ మహీధర జగన్మోహనరావు సేకరించిన సూక్తిముక్తావళి యిట్టి గ్రంథమే... విషయాన్నీ బట్టి అధ్యాయవిభాగం చేశారు... అకారాదిగా శ్లోకాల పట్టికతో బాటు ఏ గ్రంథం నుంచి ఉదాహృతమైనదో వివరంగా యిచ్చారు."
-మహీధర జగన్మోహనరావు
ఈ సూక్తులు ప్రాచీనకాలపు మహాకవుల గ్రంథమునుండి సంగ్రహింపబడినవి. ఆ కవులు లోకజ్ఞులై మానవుని వ్యక్తిరూపమును, వానిద్వారా సంఘమును దీర్చిదిద్దుటకు చక్కని సూక్తులు ప్రసాదించియున్నారు. కాన నీ పుస్తకమునకు నిడిన పేరు సార్థకము. ఇందు నిత్యవ్యవహారములలో నుదహరింపదగినవియు, మనస్సునకు బుద్ధికిని ఆత్మకును వికాసమును శుద్ధిని గూర్చు సూక్తులు వేలకు మించి యున్నవి. మృదుమధుర భాషలో వ్రాయబడి యుండుటచే చదువుటకును ధారణ చేయుటకును వీలుగా నున్నవి. "నిత్యజీవితంలో ఏ సందర్భానికి తగినట్టుగా ఆ సూక్తిని ఉదాహరించడానికి, చేతనైతే ఆ విధంగా నడుచుకోడానికి, అదివరకే ఆ ప్రకారం చేసివుంటే దాన్ని సమర్ధించుకోడానికి ఇట్టి సూక్తులు పనికివస్తాయి... ఇటువంటివి గ్రంథరూపంలో ప్రచురించేటపుడు కేవలం సూక్తిలోని విషయాన్నిబట్టి గాక ఉక్తివైచిత్రిని బట్టి కూడా ఎంచుకోవాలి... సంస్కృత వాజ్మయంనుంచి సేకరించిన సుభాషితాలతో శ్రీ మహీధర జగన్మోహనరావు సేకరించిన సూక్తిముక్తావళి యిట్టి గ్రంథమే... విషయాన్నీ బట్టి అధ్యాయవిభాగం చేశారు... అకారాదిగా శ్లోకాల పట్టికతో బాటు ఏ గ్రంథం నుంచి ఉదాహృతమైనదో వివరంగా యిచ్చారు." -మహీధర జగన్మోహనరావు
© 2017,www.logili.com All Rights Reserved.