టైలర్ తెలుగు వారికీ సన్నిహితుడు. లివర్ పూల్లో జన్మించి,1823 ప్రాంతంలో భారత దేశం వచ్చినాడు. బొంబాయిలో వ్యాపార సంస్థల్లో కొన్నాళ్ళు పనిచేసి, నిజాం సైన్యంలో చేరి అచిరకాలమున మహ్హోన్నత పదవినధిస్టించాడు. నిజాం అసఫ్ జాహి వంశీయుడు. లాక్షనికంగా అతనిది మహ్మదీయ రాజ్యమైనా దానిలో ప్రధాన భాగం తెలుగు మండలం. టైలర్ జీవితం నిజాం రాజ్యానికి అంకితమయింది. కనుక అయన చరిత్ర తెలుగు చరిత్రయే. మనదేశానికి వచ్చిన విదేశీయులు తమ యత్రానుభవములను వ్రాసినట్లే టైలర్ తన జీవిత కధను 'The story of my life' అను పేర ప్రకటించినాడు. ఇదే 'సురపురం' మెడోస్ టైలర్ ఆత్మ కధ. టైలరు జీవితంలోని ఉద్యోగదశ భారతదేశ చరిత్రతో పెనవేసుకోన్నది. సురపుర సంస్థాన విశేషములు, బెడర్లు, అరబ్బులు, రోహిళ్ళులు, రాజకుమారులు, నిజాం చరిత్ర, జాగీర్ధారుల వృత్తాంతము, విద్రోహ చర్యలు, 1857 నాటి విప్లవము ఇవీ అవీ అననేల పంతొమ్మిదవ శతాబ్ది రాజకీయ సాంఘిక చరిత్రకు అయన ఆత్మకధ రమణీయమయిన దర్పణం.
టైలర్ తెలుగు వారికీ సన్నిహితుడు. లివర్ పూల్లో జన్మించి,1823 ప్రాంతంలో భారత దేశం వచ్చినాడు. బొంబాయిలో వ్యాపార సంస్థల్లో కొన్నాళ్ళు పనిచేసి, నిజాం సైన్యంలో చేరి అచిరకాలమున మహ్హోన్నత పదవినధిస్టించాడు. నిజాం అసఫ్ జాహి వంశీయుడు. లాక్షనికంగా అతనిది మహ్మదీయ రాజ్యమైనా దానిలో ప్రధాన భాగం తెలుగు మండలం. టైలర్ జీవితం నిజాం రాజ్యానికి అంకితమయింది. కనుక అయన చరిత్ర తెలుగు చరిత్రయే. మనదేశానికి వచ్చిన విదేశీయులు తమ యత్రానుభవములను వ్రాసినట్లే టైలర్ తన జీవిత కధను 'The story of my life' అను పేర ప్రకటించినాడు. ఇదే 'సురపురం' మెడోస్ టైలర్ ఆత్మ కధ. టైలరు జీవితంలోని ఉద్యోగదశ భారతదేశ చరిత్రతో పెనవేసుకోన్నది. సురపుర సంస్థాన విశేషములు, బెడర్లు, అరబ్బులు, రోహిళ్ళులు, రాజకుమారులు, నిజాం చరిత్ర, జాగీర్ధారుల వృత్తాంతము, విద్రోహ చర్యలు, 1857 నాటి విప్లవము ఇవీ అవీ అననేల పంతొమ్మిదవ శతాబ్ది రాజకీయ సాంఘిక చరిత్రకు అయన ఆత్మకధ రమణీయమయిన దర్పణం.© 2017,www.logili.com All Rights Reserved.