ఈ పుస్తకంలో కనిపించే గాధలు నేను రాసినవి కావు.
ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. ఆ ఇద్దరు స్త్రీల చరిత్రలూ, భార్యలుగా అవమానాలు భరించిన గాధలే. "చింతామణి" నాటకం రాసిన రచయిత కాళ్ళకూరి నారాయణ రావు. " భార్యగా ఉండడమే భార్య తప్పు" అని, సమాజంలో వున్న ఒక నగ్నసత్యాన్ని స్త్రీల పట్ల ఆదరంతో చెబుతాడు. అది, స్త్రీలను హేళన చేయడం కాదు. స్త్రీలకు, ఒక సత్యాన్ని చూపించడం! ఆ రచన, వ్యభిచార సంబంధాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ద్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా, భార్యలవి అయినా, అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్ని ద్వంసం చేసే నేరాలే.
ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టు కథలు కావు. సాహిత్య కల్పనలు కావు. యదార్ధంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్భాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ల తరబడీ భద్రపరచి ఉంచాను. ఇప్పటికి వీటిని బయట పెడుతున్నాను.
ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనబడితే చాలు. తెలుసుకోవలసింది వాటినే.
- రంగనాయకమ్మ
ఈ పుస్తకంలో కనిపించే గాధలు నేను రాసినవి కావు. ఒక సంస్కర్త భార్యా, ఒక పాటల కవి భార్యా రాసినవి. ఆ ఇద్దరు స్త్రీల చరిత్రలూ, భార్యలుగా అవమానాలు భరించిన గాధలే. "చింతామణి" నాటకం రాసిన రచయిత కాళ్ళకూరి నారాయణ రావు. " భార్యగా ఉండడమే భార్య తప్పు" అని, సమాజంలో వున్న ఒక నగ్నసత్యాన్ని స్త్రీల పట్ల ఆదరంతో చెబుతాడు. అది, స్త్రీలను హేళన చేయడం కాదు. స్త్రీలకు, ఒక సత్యాన్ని చూపించడం! ఆ రచన, వ్యభిచార సంబంధాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. స్త్రీ పురుషుల కుటుంబ సంబంధాల్ని ద్వంసం చేసే అసలైన నీచ విషయం, వ్యభిచారాలే. అవి, పురుషాధిక్యత నుంచి పుట్టుకు వచ్చే నేరాలే. ఆ నేరాలు, భర్తలవి అయినా, భార్యలవి అయినా, అవి కుటుంబ శాంతి సౌఖ్యాల్నీ, బిడ్డల అనురాగ పెంపకాల్ని ద్వంసం చేసే నేరాలే. ఈ స్త్రీల చరిత్రలు చూపించిన పురుషాహంకారాలు, కట్టు కథలు కావు. సాహిత్య కల్పనలు కావు. యదార్ధంగా ఆ భార్యలు రాసిన సత్యాలు! ఆ భార్యలు రాల్చిన కన్నీటి చుక్కలు! కన్నీటి ధారలు! వేరు వేరు సందర్భాల్లో ఇవి నా చేతుల్లోకి వచ్చాయి. వీటిని నేను ఏళ్ల తరబడీ భద్రపరచి ఉంచాను. ఇప్పటికి వీటిని బయట పెడుతున్నాను. ఆ స్త్రీల భర్తల పేరులూ, వారి వూరులూ, అవసరం లేదు. జరిగిన విషయాలూ, సంఘటనలూ, కనబడితే చాలు. తెలుసుకోవలసింది వాటినే. - రంగనాయకమ్మ© 2017,www.logili.com All Rights Reserved.