భారతీయులకు పూజనీయం, నిత్యపారాయణ పురాణం, ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి అవతరించిన ఆదికావ్యం 'రామాయణం'.
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరమ్,
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్.
భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ధర్మసంరక్షణార్ధం భువిలో అయోధ్యా నగరంలో నరుడిగా, శ్రీరాముడిగా అవతరించి ఆచరించిన జీవన విధాన దర్శనమే 'శ్రీమద్రామాయణము'.
వాల్మీకి మహర్షికి నారదుడు 'రామకధ' విన్పించడానికి పూర్వమే బ్రహ్మదేవుడు దేవలిపిలో రామాయణం రచించాడని, అది 'శతకోటి' అంటే 'నూరుకోట్ల శ్లోకాలు'గా దేవలోకాల్లో ప్రచారంలో ఉందని పురాణవాక్కు.
రాముడు జన్మించి, రావణసంహారం గావించి, అయోధ్యారాజ్య పట్టాభిషిక్తుడైన తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడి ఆదేశానుసారం, నారద మహర్షి ద్వారా విన్న 'రామకధ'ని వాల్మీకి మహర్షి కావ్యరూపంలో ప్రవచించాడు. ఇలా త్రేతాయుగంలో వాల్మీకి వినిపించిన రామాయణం 24,000 శ్లోకాలతో రమణీయంగా రూపుదిద్దుకుంది.
రామాయణంలోని ఒక శ్లోకమైనా, ఒక పాదమైనా, ఒక పదం అయినా, కనీసం ఒక్క అక్షరమైనా మనస్పూర్తిగా చదివినా, చదవాలని, వినాలని అనుకున్నా చాలు... ఆ సంకల్పమే 'మహాపాతక నాశకము' అవుతుందని మహర్షులు ప్రవచించారు.
'రామాయణం' ప్రాశస్త్యాన్ని ఎరిగిన అష్టాదశ పురాణకర్త వేదవ్యాసుడు జానపదులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో 'ఆధ్యాత్మిక రామాయణం' నాలుగువేల శ్లోకాలతో తన 'బ్రహ్మాండ పురాణము'లో అందించాడు. ఇది కూడా బహుధా ప్రసిద్ధి చెందింది.
ఇప్పుడు, వాల్మీకి రామాయణం - వ్యాసుడి ఆధ్యాత్మ రామాయణం మేళవించి, నేటి పాఠకులకి అర్ధమయ్యేలా, అర్ధవంతంగా మీకు నేను అందిస్తున్నాను 'రామాయణం'.
మీ అభిమాన రచయితగా 50 ఏళ్లపాటు నన్నూ, నా రచనలను ఆదరించి ప్రోత్సహించిన మీకు, నా 'అర్ధశతాబ్ద రచనా సంవత్సర కానుక' గా సవినయంగా సమర్పిస్తున్నాను. యీ, 'రామాయణం...' స్వీకరించండి... ఆదరించండి.
- తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు
భారతీయులకు పూజనీయం, నిత్యపారాయణ పురాణం, ఆదికవి వాల్మీకి వాక్కు నుంచి అవతరించిన ఆదికావ్యం 'రామాయణం'. చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరమ్, ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనమ్. భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ధర్మసంరక్షణార్ధం భువిలో అయోధ్యా నగరంలో నరుడిగా, శ్రీరాముడిగా అవతరించి ఆచరించిన జీవన విధాన దర్శనమే 'శ్రీమద్రామాయణము'. వాల్మీకి మహర్షికి నారదుడు 'రామకధ' విన్పించడానికి పూర్వమే బ్రహ్మదేవుడు దేవలిపిలో రామాయణం రచించాడని, అది 'శతకోటి' అంటే 'నూరుకోట్ల శ్లోకాలు'గా దేవలోకాల్లో ప్రచారంలో ఉందని పురాణవాక్కు. రాముడు జన్మించి, రావణసంహారం గావించి, అయోధ్యారాజ్య పట్టాభిషిక్తుడైన తర్వాత కొంతకాలానికి బ్రహ్మదేవుడి ఆదేశానుసారం, నారద మహర్షి ద్వారా విన్న 'రామకధ'ని వాల్మీకి మహర్షి కావ్యరూపంలో ప్రవచించాడు. ఇలా త్రేతాయుగంలో వాల్మీకి వినిపించిన రామాయణం 24,000 శ్లోకాలతో రమణీయంగా రూపుదిద్దుకుంది. రామాయణంలోని ఒక శ్లోకమైనా, ఒక పాదమైనా, ఒక పదం అయినా, కనీసం ఒక్క అక్షరమైనా మనస్పూర్తిగా చదివినా, చదవాలని, వినాలని అనుకున్నా చాలు... ఆ సంకల్పమే 'మహాపాతక నాశకము' అవుతుందని మహర్షులు ప్రవచించారు. 'రామాయణం' ప్రాశస్త్యాన్ని ఎరిగిన అష్టాదశ పురాణకర్త వేదవ్యాసుడు జానపదులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో 'ఆధ్యాత్మిక రామాయణం' నాలుగువేల శ్లోకాలతో తన 'బ్రహ్మాండ పురాణము'లో అందించాడు. ఇది కూడా బహుధా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు, వాల్మీకి రామాయణం - వ్యాసుడి ఆధ్యాత్మ రామాయణం మేళవించి, నేటి పాఠకులకి అర్ధమయ్యేలా, అర్ధవంతంగా మీకు నేను అందిస్తున్నాను 'రామాయణం'. మీ అభిమాన రచయితగా 50 ఏళ్లపాటు నన్నూ, నా రచనలను ఆదరించి ప్రోత్సహించిన మీకు, నా 'అర్ధశతాబ్ద రచనా సంవత్సర కానుక' గా సవినయంగా సమర్పిస్తున్నాను. యీ, 'రామాయణం...' స్వీకరించండి... ఆదరించండి. - తాడంకి వెంకట లక్ష్మినరసింహారావు© 2017,www.logili.com All Rights Reserved.