ముందు మాట
తులువలు కొందఱు నిన్మది
దలఁపరు నెఱదంటలెల్లఁ దమి నీయడుగుం
గలమునఁ బుట్టువు మున్నీ
రలరఁగ దరి ముట్టఁ గడతు రన్నిటి తేఁడా!
నన్నెచోడుడు, పాల్కురికి సోమన తమ కావ్యములలో వాడిన భాషను 'జాను తెనుగు', 'దేశి' అని పేర్కొన్నారు. కాని నన్నెచోడుడు కుమార సంభవంలో వాడిన భాష నన్నయ, తిక్కనాదులవలె సంస్కృత మిశ్రమైన తెలుగే. పాల్కురికి సోమన తన 'బసవ పురాణం'లో 'సంస్కృత భూయిష్ఠ రచన' కంటే 'సరసమై బరగు జాను తెనుగు' కావ్యరచనకు శ్రేష్ఠమన్నాడు. కాని పై యిరువురు వాడిన భాషనుబట్టి చూస్తే అది అచ్చతెనుగు కాదని అర్ధమౌతుంది. దీనినిబట్టి పాల్కురికి సోమన నాటికి 'అచ్చతెనుగు' అనే మాట వాడుకలో లేదనవచ్చు. తత్సమేతర పదాత్మకమైన తెలుగుకు మూలఘటిక కేతన తన ఆంధ్ర భాషా భూషణంలో 'అచ్చ తెనుగు' అని సోదాహరణంగా పేర్కొన్నాడు. కేతన తెలుగు పదాలను అయిదు రకాలుగ పేర్కొన్నాడు. 'తత్సమము, తద్భవము, అచ్చతెనుగు, దేశ్యము, గ్రామ్యము’ అని చెప్పి 'తత్సమము తక్క మిగిలిన నాలుగు అచ్చతెనుగు లందు రఖిల జనులు' అని చెప్పాడు. అల్లసాని పెద్దన కృష్ణరాయల సభలో చెప్పిన 29 పాదాల ఉత్పలమాలికలో 16 పాదాలలో అచ్చతెనుగు కవితా ధర్మాలను వివరించాడు. అడిదము సూరకవి కూడా తన 'కవిజన రంజనము'లో పెద్దన చెప్పిన ధర్మాలనే చెప్పాడు. సూరకవి తాత బాలభాస్కరకవి 'శుద్ధాంధ్ర రామాయణ ఘటనా వైదుషీ దురంధరుడ'ని చెప్పుకున్నాడు. కాని ఆ గ్రంథము నేడు లభ్యము కాదు. విన్నకోట పెద్దన తన 'కావ్యాలంకార చూడామణి'లో కేతన మార్గాన్నే అనుసరించి అయిదు భేదాలు చెప్పాడు. కేతన 'అచ్చతెనుగు' అనిన దానినే పెద్దన సహజాంధ్ర దేశ భవము' అని చెప్పాడు. ఆ తరువాత లాక్షణికుడు అప్పకవి 'ఆంధ్ర శబ్ద చింతామణి' ననుసరించి పదాలను నాలుగు విధాలుగానే విభజించి, 'అచ్చతెనుగు'ను గూర్చి పేర్కొనలేదు. పొన్నికంటి తెలగన 'యయాతి చరిత్ర' పూర్వపుడైనా అప్పకవి అచ్చతెనుగు గూర్చి పేర్కొనకపోవడం విశేషం.
కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి తన 'లక్షణసార సంగ్రహము'లో 'లోక వ్యవహారమైన భాషే దేశ్యమని పండితులంటారు. దీనినే కొందరు అచ్చతెనుగంటారు' అని.........
ముందు మాట తులువలు కొందఱు నిన్మది దలఁపరు నెఱదంటలెల్లఁ దమి నీయడుగుం గలమునఁ బుట్టువు మున్నీరలరఁగ దరి ముట్టఁ గడతు రన్నిటి తేఁడా! నన్నెచోడుడు, పాల్కురికి సోమన తమ కావ్యములలో వాడిన భాషను 'జాను తెనుగు', 'దేశి' అని పేర్కొన్నారు. కాని నన్నెచోడుడు కుమార సంభవంలో వాడిన భాష నన్నయ, తిక్కనాదులవలె సంస్కృత మిశ్రమైన తెలుగే. పాల్కురికి సోమన తన 'బసవ పురాణం'లో 'సంస్కృత భూయిష్ఠ రచన' కంటే 'సరసమై బరగు జాను తెనుగు' కావ్యరచనకు శ్రేష్ఠమన్నాడు. కాని పై యిరువురు వాడిన భాషనుబట్టి చూస్తే అది అచ్చతెనుగు కాదని అర్ధమౌతుంది. దీనినిబట్టి పాల్కురికి సోమన నాటికి 'అచ్చతెనుగు' అనే మాట వాడుకలో లేదనవచ్చు. తత్సమేతర పదాత్మకమైన తెలుగుకు మూలఘటిక కేతన తన ఆంధ్ర భాషా భూషణంలో 'అచ్చ తెనుగు' అని సోదాహరణంగా పేర్కొన్నాడు. కేతన తెలుగు పదాలను అయిదు రకాలుగ పేర్కొన్నాడు. 'తత్సమము, తద్భవము, అచ్చతెనుగు, దేశ్యము, గ్రామ్యము’ అని చెప్పి 'తత్సమము తక్క మిగిలిన నాలుగు అచ్చతెనుగు లందు రఖిల జనులు' అని చెప్పాడు. అల్లసాని పెద్దన కృష్ణరాయల సభలో చెప్పిన 29 పాదాల ఉత్పలమాలికలో 16 పాదాలలో అచ్చతెనుగు కవితా ధర్మాలను వివరించాడు. అడిదము సూరకవి కూడా తన 'కవిజన రంజనము'లో పెద్దన చెప్పిన ధర్మాలనే చెప్పాడు. సూరకవి తాత బాలభాస్కరకవి 'శుద్ధాంధ్ర రామాయణ ఘటనా వైదుషీ దురంధరుడ'ని చెప్పుకున్నాడు. కాని ఆ గ్రంథము నేడు లభ్యము కాదు. విన్నకోట పెద్దన తన 'కావ్యాలంకార చూడామణి'లో కేతన మార్గాన్నే అనుసరించి అయిదు భేదాలు చెప్పాడు. కేతన 'అచ్చతెనుగు' అనిన దానినే పెద్దన సహజాంధ్ర దేశ భవము' అని చెప్పాడు. ఆ తరువాత లాక్షణికుడు అప్పకవి 'ఆంధ్ర శబ్ద చింతామణి' ననుసరించి పదాలను నాలుగు విధాలుగానే విభజించి, 'అచ్చతెనుగు'ను గూర్చి పేర్కొనలేదు. పొన్నికంటి తెలగన 'యయాతి చరిత్ర' పూర్వపుడైనా అప్పకవి అచ్చతెనుగు గూర్చి పేర్కొనకపోవడం విశేషం. కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి తన 'లక్షణసార సంగ్రహము'లో 'లోక వ్యవహారమైన భాషే దేశ్యమని పండితులంటారు. దీనినే కొందరు అచ్చతెనుగంటారు' అని.........© 2017,www.logili.com All Rights Reserved.