నిఘంటువు నిర్మాణం ఎంతో వ్యయ ప్రయాసలతో నిండి ఉంటుంది.ఒక సామాన్య వ్యక్తికి మించినపని. సంస్థలు నిర్వహించావలసినపని. ఏడాదిలోనో రెండేళ్ళలోనూ పూర్తయ్యే పనికాదు. దశాబ్దాలు పడుతుంది. ఒక జీవితకాల శ్రమ.
తెలుగులో వ్యాకరణాలు ఉన్నాయి. నిఘంటువులూ ఉన్నాయి. కానీ వాటి విస్తృతి చాల పరిమితం. ఎన్ని నిఘంటువులు కూర్చినా మరో నిఘంటువు ఆవశ్యకత వెనువెంటనే తోస్తుంది.
నిఘంటువులు అనేక రకాలుగా ఉంటాయి. మనం సాధారణంగా ఉపయోగించే నిఘంటువు అకారాది క్రమంలో ఉండి అర్ధవివరణ ఇచ్చే నిఘంటువు. పర్యాయపద నిఘంటువులూ, నానార్ధ నిఘంటువులూ, వివిధ ప్రత్యేక విషయాలు, శాస్త్రాలకు సంబంధించిన నిఘంటువులూ ఉన్నాయి. కవులకు ఉపయోగపడే నిఘంటువులు కొన్నిటిలో పర్యాయ పద, నానార్ధ, ఏకాక్షర నిఘంటువులున్నాయి. తెలుగు కవిత్వంలో ముఖ్యంగా పద్య కవిత్వంలో ప్రాస అన్న లక్షణం ఉంది. పద్యపాదంలో రెండో అక్షరం ప్రాస. పద్యం నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం ఒక్కటిగా ఉండడం ప్రాసనియమం. ప్రాస కోసం కవులు నానాపాట్లు పడుతుంటారు. అన్ని భాషల్లోనూ ఇది ఎంతో కొంత ఉంటుంది. తెలుగులో మరీ ఎక్కువ.
అలంకారంగా మరికొన్ని రకాల ప్రాసలున్నాయి. వాటిలో అంత్యాను ప్రాస ఒకటి. పద్యంలోని పాదాలన్ని ఒకే అక్షరంతో ముగియడం. ఎటువంటి ప్రాసకైన ఉపయోగపడేది ప్రాసపద నిఘంటువు.
దీన్ని సాధారణ నిఘంటువుగాను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే పదంలోని మొదటి అక్షరంతో కాక రెండో అక్షరంతో చూసుకోవాలి. అంటే ఈ నిఘంటువు సాధారణ నిఘంటువులాగా అందరికీ ఉపయోగపడుతూనే ప్రత్యేకంగా శబ్ద ప్రయోగనిపుణులైన కవులకు మరింతగా ఉపయోగపడుతుంది.
నిఘంటువు నిర్మాణం ఎంతో వ్యయ ప్రయాసలతో నిండి ఉంటుంది.ఒక సామాన్య వ్యక్తికి మించినపని. సంస్థలు నిర్వహించావలసినపని. ఏడాదిలోనో రెండేళ్ళలోనూ పూర్తయ్యే పనికాదు. దశాబ్దాలు పడుతుంది. ఒక జీవితకాల శ్రమ. తెలుగులో వ్యాకరణాలు ఉన్నాయి. నిఘంటువులూ ఉన్నాయి. కానీ వాటి విస్తృతి చాల పరిమితం. ఎన్ని నిఘంటువులు కూర్చినా మరో నిఘంటువు ఆవశ్యకత వెనువెంటనే తోస్తుంది. నిఘంటువులు అనేక రకాలుగా ఉంటాయి. మనం సాధారణంగా ఉపయోగించే నిఘంటువు అకారాది క్రమంలో ఉండి అర్ధవివరణ ఇచ్చే నిఘంటువు. పర్యాయపద నిఘంటువులూ, నానార్ధ నిఘంటువులూ, వివిధ ప్రత్యేక విషయాలు, శాస్త్రాలకు సంబంధించిన నిఘంటువులూ ఉన్నాయి. కవులకు ఉపయోగపడే నిఘంటువులు కొన్నిటిలో పర్యాయ పద, నానార్ధ, ఏకాక్షర నిఘంటువులున్నాయి. తెలుగు కవిత్వంలో ముఖ్యంగా పద్య కవిత్వంలో ప్రాస అన్న లక్షణం ఉంది. పద్యపాదంలో రెండో అక్షరం ప్రాస. పద్యం నాలుగు పాదాల్లోనూ రెండో అక్షరం ఒక్కటిగా ఉండడం ప్రాసనియమం. ప్రాస కోసం కవులు నానాపాట్లు పడుతుంటారు. అన్ని భాషల్లోనూ ఇది ఎంతో కొంత ఉంటుంది. తెలుగులో మరీ ఎక్కువ. అలంకారంగా మరికొన్ని రకాల ప్రాసలున్నాయి. వాటిలో అంత్యాను ప్రాస ఒకటి. పద్యంలోని పాదాలన్ని ఒకే అక్షరంతో ముగియడం. ఎటువంటి ప్రాసకైన ఉపయోగపడేది ప్రాసపద నిఘంటువు. దీన్ని సాధారణ నిఘంటువుగాను ఉపయోగించుకోవచ్చు. కాకపోతే పదంలోని మొదటి అక్షరంతో కాక రెండో అక్షరంతో చూసుకోవాలి. అంటే ఈ నిఘంటువు సాధారణ నిఘంటువులాగా అందరికీ ఉపయోగపడుతూనే ప్రత్యేకంగా శబ్ద ప్రయోగనిపుణులైన కవులకు మరింతగా ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.