ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో వందలాది ఉర్దూ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి వ్యుత్పత్తి, అర్థం తెలుసుకోవడానికి తెలుగు లిపిలో కూర్చిన నిఘంటువు ఉర్దూ - తెలుగు నిఘంటువు. తెలుగు వర్ణక్రమాన్ని అనుసరించి నిర్మించిన ఈ నిఘంటువు భాషా పరిశోధకులకూ, పాత్రికేయులకూ తెలుగు పాఠకులందరికీ ఉర్దూ భాషాభిమానులకూ, జిజ్ఞాసువులకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు వర్ణక్రమం పాటించి తెలుగు లిపిలో ప్రచురితమయిన తొలి ఉర్దూ - తెలుగు నిఘంటువు.
ఉర్దూ పదజాలం విషయంలోనే సమస్య. తెలుగువారు ఉర్దూభాషా పదాలు వాడడం ఎక్కువే. కాని ఉర్దూ లిపి తెలిసినవారు ఈ కాలంలో చాలా తక్కువేనని చెప్పాలి. లిపి తెలియకుండా ఉర్దూ - ఉర్దూ నిఘంటువు గాని, ఉర్దూ - తెలుగు నిఘంటువును గాని ఉపయోగించడం కష్టం. లక్ష్మణ్ రావు పతంగే గారు తెలుగు లిపిలో, తెలుగు వర్ణక్రమంలో ఉర్దూ - తెలుగు నిఘంటువును కూర్చారు. ఈ ఉర్దూ - తెలుగు నిఘంటువు తెలుగు మాత్రమే వచ్చిన ముస్లిం సోదరులందరికీ, తెలుగువారందరికీ ఉపయోగపడుతుందనడంలో సందేహంలేదు.
ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో వందలాది ఉర్దూ పదాలు వాడుకలో ఉన్నాయి. వాటి వ్యుత్పత్తి, అర్థం తెలుసుకోవడానికి తెలుగు లిపిలో కూర్చిన నిఘంటువు ఉర్దూ - తెలుగు నిఘంటువు. తెలుగు వర్ణక్రమాన్ని అనుసరించి నిర్మించిన ఈ నిఘంటువు భాషా పరిశోధకులకూ, పాత్రికేయులకూ తెలుగు పాఠకులందరికీ ఉర్దూ భాషాభిమానులకూ, జిజ్ఞాసువులకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలుగు వర్ణక్రమం పాటించి తెలుగు లిపిలో ప్రచురితమయిన తొలి ఉర్దూ - తెలుగు నిఘంటువు. ఉర్దూ పదజాలం విషయంలోనే సమస్య. తెలుగువారు ఉర్దూభాషా పదాలు వాడడం ఎక్కువే. కాని ఉర్దూ లిపి తెలిసినవారు ఈ కాలంలో చాలా తక్కువేనని చెప్పాలి. లిపి తెలియకుండా ఉర్దూ - ఉర్దూ నిఘంటువు గాని, ఉర్దూ - తెలుగు నిఘంటువును గాని ఉపయోగించడం కష్టం. లక్ష్మణ్ రావు పతంగే గారు తెలుగు లిపిలో, తెలుగు వర్ణక్రమంలో ఉర్దూ - తెలుగు నిఘంటువును కూర్చారు. ఈ ఉర్దూ - తెలుగు నిఘంటువు తెలుగు మాత్రమే వచ్చిన ముస్లిం సోదరులందరికీ, తెలుగువారందరికీ ఉపయోగపడుతుందనడంలో సందేహంలేదు.© 2017,www.logili.com All Rights Reserved.