జ్యోతిస్స్వరూపుడైన పరమాత్మ మాటలకతీతుడు. నా ఎదలో ప్రవేశించుట చేత ఆశలనే మహాసముద్రాన్ని దాటాను. ఇంద్రియములనే పక్షులు నిర్విర్యమై ఎగురలేకపోయాయి. నేను అనే అభిమానం పోయింది. ఈ లోకంలో సమస్తము నివేననే సత్యాన్ని గ్రహించాను. ప్రతి అణువు నీవే. శ్రీ పేరుందరై నాయకా, ని స్థితిని కరుణతో నీవు తెల్పితేనే గాని తెలిసికోనగల వారేవ్వరు? సూర్యునివలె నామదిలోని అంధకారాన్ని తొలగించిన నీ పై సదా మనసు నిలిచింది.
నేను ఆ పరావస్తువులో లీనమైతే: శంఖధ్వనులకు సమానమైన నాదమక్కడ ధ్వనించగలదా? జనమతో వచ్చిన గుణాలు, జాతి బేధాలు వుంటాయా? ఇది మంచి, ఇది చెడు అనే మాయలు అణగకుండా ఉంటాయా? భక్తుల భక్తులమనే భావం, వారిని సేవించాలనే సంకల్ప ముంటుందా? అట్టి మనోనాశస్థితిలో జీవాత్మభావ ముంటుందా? భక్తుల శివానుభావాలచట ఉండగలవా? అంతా నిండి, అమృతధారలు కురిపించే పరంజ్యోతిని పొందాలనే భావ ముంటుందా?
భక్తులారా, మీకు మీరే బంధువులు, శత్రువులు. మేమేవరము? ఏది మాది? అహంకార మమకారాలు ఏమిటి? బంధములు ఏమిటని విచారించండి. ఈ మిథ్యాజీవితానికి స్వస్తి పలకండి. కోరికలను త్యజించండి. పరమేశ్వరుని భక్తులతో కూడి వారి అనుగ్రహానికి తపించండి.
(ఈ సంవత్సరం కొత్తగా విడుదల అయిన పుస్తకం.)
-తాడిమేటి సత్యనారాయణ.
© 2017,www.logili.com All Rights Reserved.