''నన్ను పాఠకులు అవగాహన చేసుకోవాలని యీ కావ్యంలో కాంక్షించినంతగా నే నెప్పుడూ కాంక్షించలేదు. బహుశా నా రచనలలో కెల్ల అత్యంత నిష్ఠగా రాసింది యిది'' అని మయకోవ్‌స్కీ తన స్నేహితులతో అన్నాడు. 'ప్లదీమిర్ ఇల్వీచ్ లెనిన్' 1924లో రచింపబడింది. ఈ యితి వృత్తం మీద జరిగిన దీర్ఘసన్నాహక కృషియొక్క ఫలితం యిది. అనేక సందర్భాలలో లెనిన్‌ను చూసే, వినే అదృష్టం కలిగిందికవికి. 1917 అక్టోబర్ దినాలలో, తిరుగుబాటుకు కేంద్ర కార్యాలయమైన స్మోల్నీలో యితను లెనిన్‌ను చూసినాడు. తరువాత యితను సోవియట్ రాజ్య స్థాపకుని ఉపన్యాసాలు కొన్నివిన్నాడు. మయకోవ్‌స్కీ లెనిన్‌ను చారిత్రక వ్యక్తిగా అత్యంత వాస్తవానుగుణంగా చిత్రించడానికి ప్రయత్నించడమే కాదు, యితని మాటల్లోనే చెప్పాలంటే, ''కవిగానే వుంటూ ఈ కావ్యం రాసినాను.'' యితను తన జీవితమంతా యేసమస్యలతో మగ్నమైనాడో ఆ సమస్యల పరిష్కారాల కొరకు లెనిన్ జీవితంలోనూ, ఆయన కార్యకలాపాల్లోనూ అన్వేషించినాడు. ఆ సమస్య లేవంటే; మానవుడు, మానవుని గమ్యం, ప్రపంచంలో మానవుని స్థానం, మానవుని ఆనందం, జీవితంలోని విషాదం మీద మానవుని పోరాటమూ, విజయమూ. ''తుదిదాకా మానవు లందరి కన్నా మానవుడుగా నిలిచా డతడు...'' వ్లదీమిర్ మయకోవ్‌స్కీ అనువాదం : శ్రీశ్రీ
''నన్ను పాఠకులు అవగాహన చేసుకోవాలని యీ కావ్యంలో కాంక్షించినంతగా నే నెప్పుడూ కాంక్షించలేదు. బహుశా నా రచనలలో కెల్ల అత్యంత నిష్ఠగా రాసింది యిది'' అని మయకోవ్‌స్కీ తన స్నేహితులతో అన్నాడు. 'ప్లదీమిర్ ఇల్వీచ్ లెనిన్' 1924లో రచింపబడింది. ఈ యితి వృత్తం మీద జరిగిన దీర్ఘసన్నాహక కృషియొక్క ఫలితం యిది. అనేక సందర్భాలలో లెనిన్‌ను చూసే, వినే అదృష్టం కలిగిందికవికి. 1917 అక్టోబర్ దినాలలో, తిరుగుబాటుకు కేంద్ర కార్యాలయమైన స్మోల్నీలో యితను లెనిన్‌ను చూసినాడు. తరువాత యితను సోవియట్ రాజ్య స్థాపకుని ఉపన్యాసాలు కొన్నివిన్నాడు. మయకోవ్‌స్కీ లెనిన్‌ను చారిత్రక వ్యక్తిగా అత్యంత వాస్తవానుగుణంగా చిత్రించడానికి ప్రయత్నించడమే కాదు, యితని మాటల్లోనే చెప్పాలంటే, ''కవిగానే వుంటూ ఈ కావ్యం రాసినాను.'' యితను తన జీవితమంతా యేసమస్యలతో మగ్నమైనాడో ఆ సమస్యల పరిష్కారాల కొరకు లెనిన్ జీవితంలోనూ, ఆయన కార్యకలాపాల్లోనూ అన్వేషించినాడు. ఆ సమస్య లేవంటే; మానవుడు, మానవుని గమ్యం, ప్రపంచంలో మానవుని స్థానం, మానవుని ఆనందం, జీవితంలోని విషాదం మీద మానవుని పోరాటమూ, విజయమూ. ''తుదిదాకా మానవు లందరి కన్నా మానవుడుగా నిలిచా డతడు...'' వ్లదీమిర్ మయకోవ్‌స్కీ అనువాదం : శ్రీశ్రీ© 2017,www.logili.com All Rights Reserved.