వీర తెలంగాణ విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కరమూకలనూ ఆ తరువాత నెహ్రు సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటం గాని మన దేశ చరిత్రలోనే లేదు.
సుందరయ్యగారు రచించిన యీ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామజిక, రాజకీయ, భౌతిక పరిస్థితిల్లో ఆ పోరాటం పుట్టిపెరిగిందో వివరించి, మారిన పరిస్థితులరీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదికరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది. ఆ పోరాటం నడిచిన తీరు, సాధించిన విజయలూ ఇందు విదితమవుతాయి. అందులో పాల్గొన్నవారు - స్త్రీలూ పురుషులూ, మట్టిలోనుంచి పుట్టిన మాణిక్యాలవలె, సామాన్య జనంనుండి జనించి మహావీరులై పోరాడిన గాధలు స్మరణకు స్ఫురణకూ వస్తాయి. కనుక భవిష్యత్ మర్క్రిస్టు - లెనినిస్టు విప్లవకారులకు శిక్షణగరిపే పుస్తక గ్రంథం.
వీర తెలంగాణ విప్లవ పోరాటం మన దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహోన్నతమైన విప్లవ ప్రజా పోరాటం. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నిర్మూలన కోసం ప్రారంభమైన తెలంగాణా ప్రజాందోళన చివరికి సాయుధ పోరాట స్వరూపాన్ని తీసుకొని నైజాం ముష్కరమూకలనూ ఆ తరువాత నెహ్రు సైన్యాలను ఎదిరించి అయిదేండ్లపాటు 1946 నుండి 1951 వరకూ సాగింది. గత రెండు వందల సంవత్సరాల చరిత్రలో తెలంగాణా ప్రజా పోరాటంతో పోల్చదగిన ఉద్యమం గాని, పోరాటం గాని మన దేశ చరిత్రలోనే లేదు. సుందరయ్యగారు రచించిన యీ గ్రంథం అసలు తెలంగాణా పోరాటపు మొత్తం చరిత్ర. ఏ సామజిక, రాజకీయ, భౌతిక పరిస్థితిల్లో ఆ పోరాటం పుట్టిపెరిగిందో వివరించి, మారిన పరిస్థితులరీత్యా దాని ఉపసంహరణ ఎలా అవసరమైనదీ విశదికరించి, అమూల్యమైన గుణపాఠాలు తీసిన గ్రంథం ఇది. ఆ పోరాటం నడిచిన తీరు, సాధించిన విజయలూ ఇందు విదితమవుతాయి. అందులో పాల్గొన్నవారు - స్త్రీలూ పురుషులూ, మట్టిలోనుంచి పుట్టిన మాణిక్యాలవలె, సామాన్య జనంనుండి జనించి మహావీరులై పోరాడిన గాధలు స్మరణకు స్ఫురణకూ వస్తాయి. కనుక భవిష్యత్ మర్క్రిస్టు - లెనినిస్టు విప్లవకారులకు శిక్షణగరిపే పుస్తక గ్రంథం.
© 2017,www.logili.com All Rights Reserved.