సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అన్నింటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది ఏ ఉత్పత్తి విధానం మీద ఆధారపడింది అన్న విషయం పైనే నిర్ధారింపబడుతుంది. ఒక వ్యక్తి ఆ సమాజంలో ఉత్పత్తి శక్తులతో ఎలాంటి సంబంధం ఉంది అన్న అంశంపై ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందాడన్నది తెలుస్తుంది. సమాజం సమూలంగా మార్పు చెందడంలో మౌలిక పాత్ర వహించేది వర్గాలు, వర్గపోరాటమే. రకరకాల అస్తిత్వవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చి, విచ్చిన్న వేర్పాటువాద ఉద్యమాలకు సైతం వూతమిస్తున్న నేటి తరుణంలో వర్గ విశ్లేషణ ప్రాధాన్యత ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం సముచితమైన రీతిలో దోహదపడుతుంది.
సమాజ పరిణామంలో వర్గం పాత్ర, ప్రాముఖ్యత అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడే రచనల సంకలనం ఇది. సమాజంలో వ్యక్తులకు, సమూహాలకు లింగ, వర్ణ, జాతి, మతం, ప్రాంతం తదితర పలురకాల గుర్తింపులుంటాయి. ఇవేవి ఉన్నప్పటికీ అన్నింటిలోకి కీలకమైనది వర్గమే. ఎందువల్లనంటే ఏ సమాజ మౌలిక స్వభావం అయినా అది ఏ ఉత్పత్తి విధానం మీద ఆధారపడింది అన్న విషయం పైనే నిర్ధారింపబడుతుంది. ఒక వ్యక్తి ఆ సమాజంలో ఉత్పత్తి శక్తులతో ఎలాంటి సంబంధం ఉంది అన్న అంశంపై ఆ వ్యక్తి ఏ వర్గానికి చెందాడన్నది తెలుస్తుంది. సమాజం సమూలంగా మార్పు చెందడంలో మౌలిక పాత్ర వహించేది వర్గాలు, వర్గపోరాటమే. రకరకాల అస్తిత్వవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చి, విచ్చిన్న వేర్పాటువాద ఉద్యమాలకు సైతం వూతమిస్తున్న నేటి తరుణంలో వర్గ విశ్లేషణ ప్రాధాన్యత ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం సముచితమైన రీతిలో దోహదపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.