1946 లో నోబెల్ బహుమానాన్ని స్వీకరించిన హెర్మన్ హెస్ (స్విస్) రచించిన సుప్రసిద్ధ నవల "సిద్దార్థ". దీన్ని హిల్డా ఆంగ్ల భాషలోకి అనువదించారు. దానికిది తెలుగు అనువాదం.
దీనిలో ఇతివృత్తం గౌతమ బుద్ధుని కాలంనాటిది. ఇందలి కథానాయకుడు గౌతమ బుద్ధుడు కాడు. ఈ సిద్ధార్థుడు ఒక బ్రహ్మణయువకుడు. వైదిక సాధనల వల్ల జీవిత పరమార్థాన్ని పొందజాలక, శ్రమణులతో కలిసి యోగసాధనలను అభ్యసిస్తాడు. అవీ లాభించవు. గౌతమ బుద్ధుని దర్శించి ఆయన బోధలు వింటాడు. వాటివల్లనూ పరమార్థం గోచరించదని తేల్చుకుంటాడు. సంసారంలో దిగి ఒక వేశ్యతో అన్ని భోగాలు అనుభవిస్తాడు. విరివిగా ధనం ఆర్జిస్తాడు. జూదంలోనూ, త్రాగుడు క్రిందనూ ధనాన్ని వ్యయిస్తాడు.
సంసార సుఖాల మీద రోత కలుగుతుంది. అన్నీ విడిచి ఒక పల్లెకారితో సహవాసం చేస్తాడు. ఆ పల్లెకారివల్లనూ, ఒక నదిద్వారాను పరమార్థాన్ని తెలుసుకుంటాడు.
"జీవితంలో ప్రతిక్షణమూ ఏకత్వాన్ని దర్శించడమే జ్ఞానం. జ్ఞానం ఒకరివల్ల నేర్చుకునేది కాదు. ఎవరికి వారు అనుభవపూర్వకంగా గ్రహించాలి."
అన్నది ఈ నవల సారాంశం.
- హెర్మన్ హెస్

Features
: Siddhartha
: Bellamkonda Raghava Rao Hilda Roznar Hermann Hesse Swiss