మోసగాళ్ళ దేశం
ఒక ఊరిలో ఒక పెద్ద మోసగాడు వుండేవాడు. వాడు చేతికి తెలియకుండా గాజులను, చెవికి తెలియకుండా కమ్మలను కాజేసే రకం. దాంతో వానికి తన కన్నా పెద్ద మోసగాడు చుట్టుపక్కల ఎక్కడా ఎవడూ లేడని చానా పొగరెక్కింది.
ఒకసారి వాళ్ల ఇంటికి వాళ్ళ మామ వచ్చాడు. ఆయన రోజుకొక ఊరికి పోతా, ఆ ఊరిలోని వింతలు విశేషాలు తెలుసుకుంటా, గుళ్ళు గోపురాలు చూసుకుంటా తిరుగుతా వుంటాడు. ఈ మోసగాడు ఆయనతో "మామా... నువ్వు తిరగని ఊరూ లేదు. చూడని మనిషీ లేడు. నీకు తెలియని వింతా లేదు. కనబడని విశేషమూ లేదు... అని అందరూ అంటా ఉంటారు. ఈ ముల్లోకాల్లో నాకన్నా పెద్ద మోసగాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశావా” అన్నాడు.
దానికి ఆయన నవ్వి “ఒరేయ్... తాడి తన్నే వాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వుంటాడంటారు గదా పెద్దలు. ఇక్కడికి నూరు మైళ్ళ దూరంలో ఒక ఊరు వుందిరా... అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వందల మంది మోసగాళ్లే. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డాడు, ఎవడు ఎప్పుడు ఎలా మోసం చేసి పోతాడో మనలని పుట్టించిన ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఆ ఊరి గురించి ఆ చుట్టుపక్కలంతా కథలు కథలుగా చెప్పుకుంటా వుంటారు" అన్నాడు.................
మోసగాళ్ళ దేశం ఒక ఊరిలో ఒక పెద్ద మోసగాడు వుండేవాడు. వాడు చేతికి తెలియకుండా గాజులను, చెవికి తెలియకుండా కమ్మలను కాజేసే రకం. దాంతో వానికి తన కన్నా పెద్ద మోసగాడు చుట్టుపక్కల ఎక్కడా ఎవడూ లేడని చానా పొగరెక్కింది. ఒకసారి వాళ్ల ఇంటికి వాళ్ళ మామ వచ్చాడు. ఆయన రోజుకొక ఊరికి పోతా, ఆ ఊరిలోని వింతలు విశేషాలు తెలుసుకుంటా, గుళ్ళు గోపురాలు చూసుకుంటా తిరుగుతా వుంటాడు. ఈ మోసగాడు ఆయనతో "మామా... నువ్వు తిరగని ఊరూ లేదు. చూడని మనిషీ లేడు. నీకు తెలియని వింతా లేదు. కనబడని విశేషమూ లేదు... అని అందరూ అంటా ఉంటారు. ఈ ముల్లోకాల్లో నాకన్నా పెద్ద మోసగాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూశావా” అన్నాడు. దానికి ఆయన నవ్వి “ఒరేయ్... తాడి తన్నే వాడు ఒకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు వుంటాడంటారు గదా పెద్దలు. ఇక్కడికి నూరు మైళ్ళ దూరంలో ఒక ఊరు వుందిరా... అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు వందల వందల మంది మోసగాళ్లే. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డాడు, ఎవడు ఎప్పుడు ఎలా మోసం చేసి పోతాడో మనలని పుట్టించిన ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఆ ఊరి గురించి ఆ చుట్టుపక్కలంతా కథలు కథలుగా చెప్పుకుంటా వుంటారు" అన్నాడు.................© 2017,www.logili.com All Rights Reserved.