ఐదు రూపాయలు
అమలు ఇంటి ముందు ఒక బావి ఉంది.
ఒకరోజు బావిలోని నీటిని తోడుకుంటూ వుంటే తాడు తెగి బిందె బావిలో పడిపోయింది.
పైకి తీయమని ఎందరినో అడిగింది. ఎవరూ సహాయం చేయలేదు.
కొందరు బావిలోకి దిగి బిందె బైటికి తీసుకొని రావడానికి వంద రూపాయలు అడిగారు.
ఆమె ఇంటిలో వంద రూపాయలు లేవు. దాంతో ఏం చేయాలా అని ఆలోచించింది.
ఇంటికి కొంచం దూరంలో ఆమె కొడుకు కనబడినాడు.
అతను చాలా సోమరిపోతు. ఏ పనీ చేయడు. తినడం తిరగడం అంతే....
సహాయం చేయమని అడిగినా చేయడు. ఏం చేయాలా అని అమల బాగా ఆలోచించింది.
ఇంటిలోకి పోయి ఐదు రూపాయల నోటు తీసుకొంది.
ఒక పొడవైన దారం దానికి తగిలించి కొడుకు తిరిగే దారిలో కనబడేలా ఉంచింది. సోమరిపోతు కాసేపటికి ఆ ఐదు రూపాయల నోటు చూశాడు.
అటూఇటూ గమనించాడు. ఎవరూ లేరు.
ఆనందంగా ఆ నోటును తీసుకోవడానికి రాసాగాడు.
బావి వెనుక నుండి అమల వేగంగా దారం లాగింది.
ఆ నోటు ఎగిరి బావిలో పడింది.
గాలికి ఎగిరిపడింది అనుకొని ఆ సోమరిపోతు ఆశతో ఆ నోటు కోసం బావిలోకి దిగాడు.
వెంటనే అమల పైనుంచి "ఎలాగూ లోపలికి దిగావు గదా... మన బిందె గూడా పడిపోయింది. కొంచం వెదికి పైకి తీసుకురా. ఒక ఐదు రూపాయలు నీ చేతిలో పెడతాలే” అంది.
వాడు ఊరికే ఇంకో ఐదు రూపాయలు దొరుకుతాయనే ఆశతో సంబరంగా ఆ బిందెను వెదికి ఆమెకు అందించాడు.
వందరూపాయల పని పది రూపాయలతో ఐపోయినందుకు ఆమె చాలా సంతోషించింది.....................
ఐదు రూపాయలు అమలు ఇంటి ముందు ఒక బావి ఉంది. ఒకరోజు బావిలోని నీటిని తోడుకుంటూ వుంటే తాడు తెగి బిందె బావిలో పడిపోయింది. పైకి తీయమని ఎందరినో అడిగింది. ఎవరూ సహాయం చేయలేదు. కొందరు బావిలోకి దిగి బిందె బైటికి తీసుకొని రావడానికి వంద రూపాయలు అడిగారు. ఆమె ఇంటిలో వంద రూపాయలు లేవు. దాంతో ఏం చేయాలా అని ఆలోచించింది. ఇంటికి కొంచం దూరంలో ఆమె కొడుకు కనబడినాడు. అతను చాలా సోమరిపోతు. ఏ పనీ చేయడు. తినడం తిరగడం అంతే.... సహాయం చేయమని అడిగినా చేయడు. ఏం చేయాలా అని అమల బాగా ఆలోచించింది. ఇంటిలోకి పోయి ఐదు రూపాయల నోటు తీసుకొంది. ఒక పొడవైన దారం దానికి తగిలించి కొడుకు తిరిగే దారిలో కనబడేలా ఉంచింది. సోమరిపోతు కాసేపటికి ఆ ఐదు రూపాయల నోటు చూశాడు. అటూఇటూ గమనించాడు. ఎవరూ లేరు. ఆనందంగా ఆ నోటును తీసుకోవడానికి రాసాగాడు. బావి వెనుక నుండి అమల వేగంగా దారం లాగింది. ఆ నోటు ఎగిరి బావిలో పడింది. గాలికి ఎగిరిపడింది అనుకొని ఆ సోమరిపోతు ఆశతో ఆ నోటు కోసం బావిలోకి దిగాడు. వెంటనే అమల పైనుంచి "ఎలాగూ లోపలికి దిగావు గదా... మన బిందె గూడా పడిపోయింది. కొంచం వెదికి పైకి తీసుకురా. ఒక ఐదు రూపాయలు నీ చేతిలో పెడతాలే” అంది. వాడు ఊరికే ఇంకో ఐదు రూపాయలు దొరుకుతాయనే ఆశతో సంబరంగా ఆ బిందెను వెదికి ఆమెకు అందించాడు. వందరూపాయల పని పది రూపాయలతో ఐపోయినందుకు ఆమె చాలా సంతోషించింది.....................© 2017,www.logili.com All Rights Reserved.