ప్రస్తుతం మనం మాయా జాలంలో ఉన్నాం. మనకు మనం తెలియని మాదక దశలో జీవిస్తున్నాం.
మనదేశంలో విదేశీయులం అయినాం. మన వేషభాషలను దులిపేస్తున్నాం. భారత ప్రదేశాన్ని దర్శింపలేని దివాంధులం అయినాం.
మన మహోన్నత నాగరికత - సంస్కృతి - సంప్రదాయాలు - సాహిత్యం - శిల్పం - కళలు - తాత్వికత కోసం త్రవ్వుకోవలసిన నికృష్ట స్థితికి చేరుకున్నాం. స్వధర్మమును వదిలాం. భయంకరం అయిన పరధర్మపు మరీచికల వెంట పరుగులు తీస్తున్నామని తెలియకున్నాం.
ఇది కేవలం స్వయంకృత అపరాధం, ఆత్మహత్య వంటిది.
మనకు అమెరికాను గురించి మరింత తెలుసు - భరత భూమిని గురించి ఏమీ తెలియదు.
- దాశరథి రంగాచార్య