కథలంటే చెవులు కోసుకోనిదెవరు? పళ్ళు రాని పాపాయి నుండి పళ్ళురాలిన తాతాయి దాకా కథలంటే అందరికీ ఇష్టమే. చందమామ కథలు వింటూ పాలబువ్వ తి౦టానంటుంది పాపాయి. రాకుమారుడు, రాకుమార్తె కథలు చెప్తేనే జడవేయించుకుంటానంటోంది, బడికెళ్లే అమ్మాయి. నవల తీసుకొస్తేనే వంట చేస్తానంటోంది అర్ధాంగి, సిన్మాకి పంపిస్తానంటేనే పప్పురుబ్బుతానంటోంది పనిమనిషి. పురాణం చదవందే నిద్ర రాదంటుంది బామ్మ, డైలీ సీరియల్ ప్రచురిస్తున్న వార్తాపత్రికనే కొంటానంటాడు రీడర్... ఇలా మన నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది కథ. తులుగు కథది ఓ ప్రత్యేకత. కథ ఎప్పుడు పుట్టిందో... ఎలా పుట్టిందో చదవడం కష్టమే. కారణం మనిషికున్న౦త చరిత్రవుంది కథకి.
కథ విననివాడు, కథ చెప్పలేనివాడు, మన దేశంలో భూతద్దంతో వెదికినా దొరకడు. ఆరోజు పుస్తకాల్లో మూలుగుతున్న కథలు పూర్వం నాయికలపై ఆడేవి. నిజానికి మనుసులో నిలిచేదే కథ. మనసుకి హత్తుకుపోయేదే కథ. కథకి కొలతలూ, కొలమానాల్లేవు. ఎవరి పద్దతిలో వాళ్ళు రాస్తారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆకట్టుకుంటారు. కొందరు రైటర్స్ ప్రతిపాదించే విషయం, పట్టుకున్న సిద్ధాంతం మనకిచ్చినా, వారి శైలి, కథాకథనం మనలను ఆకట్టుకుంటుంది. కథలు వ్రాయడం చాలా సులభం అనుకుంటారు కొందరు. ఉదయాన్నే ఓ కథ, మధ్యాహ్నాన్నికో కథ, రాత్రికి మరొకటి రాసి పారేయగల మహానుభావులున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం. మనమెంత తేలిగ్గా వ్రాస్తే అంత తేలికగానే ఉంటుంది కథ. కారణం కథలు వ్రాయడం సులభమే కావచ్చు. కానీ మంచి కథలు వ్రాయడం మాత్రంకాదు. అదోతపస్సు, దానికై నిరంతర పఠనం, పరిశీలనా, లేఖనం అవసరం.
నేను రాసిన ఈ కథలు పాఠకుల్ని ఆకట్టుకుంటాయని, మనస్సుని హత్తుకుంటాయని భావిస్తున్నాను. సహృదయులైన పాఠకుల నుండి, విమర్శకుల నుండి సలహాల్ని, విమర్శలను, అభిప్రాయాలను కోరుకుంటూ...
- మీ శైలి
కథలంటే చెవులు కోసుకోనిదెవరు? పళ్ళు రాని పాపాయి నుండి పళ్ళురాలిన తాతాయి దాకా కథలంటే అందరికీ ఇష్టమే. చందమామ కథలు వింటూ పాలబువ్వ తి౦టానంటుంది పాపాయి. రాకుమారుడు, రాకుమార్తె కథలు చెప్తేనే జడవేయించుకుంటానంటోంది, బడికెళ్లే అమ్మాయి. నవల తీసుకొస్తేనే వంట చేస్తానంటోంది అర్ధాంగి, సిన్మాకి పంపిస్తానంటేనే పప్పురుబ్బుతానంటోంది పనిమనిషి. పురాణం చదవందే నిద్ర రాదంటుంది బామ్మ, డైలీ సీరియల్ ప్రచురిస్తున్న వార్తాపత్రికనే కొంటానంటాడు రీడర్... ఇలా మన నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది కథ. తులుగు కథది ఓ ప్రత్యేకత. కథ ఎప్పుడు పుట్టిందో... ఎలా పుట్టిందో చదవడం కష్టమే. కారణం మనిషికున్న౦త చరిత్రవుంది కథకి. కథ విననివాడు, కథ చెప్పలేనివాడు, మన దేశంలో భూతద్దంతో వెదికినా దొరకడు. ఆరోజు పుస్తకాల్లో మూలుగుతున్న కథలు పూర్వం నాయికలపై ఆడేవి. నిజానికి మనుసులో నిలిచేదే కథ. మనసుకి హత్తుకుపోయేదే కథ. కథకి కొలతలూ, కొలమానాల్లేవు. ఎవరి పద్దతిలో వాళ్ళు రాస్తారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఆకట్టుకుంటారు. కొందరు రైటర్స్ ప్రతిపాదించే విషయం, పట్టుకున్న సిద్ధాంతం మనకిచ్చినా, వారి శైలి, కథాకథనం మనలను ఆకట్టుకుంటుంది. కథలు వ్రాయడం చాలా సులభం అనుకుంటారు కొందరు. ఉదయాన్నే ఓ కథ, మధ్యాహ్నాన్నికో కథ, రాత్రికి మరొకటి రాసి పారేయగల మహానుభావులున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం. మనమెంత తేలిగ్గా వ్రాస్తే అంత తేలికగానే ఉంటుంది కథ. కారణం కథలు వ్రాయడం సులభమే కావచ్చు. కానీ మంచి కథలు వ్రాయడం మాత్రంకాదు. అదోతపస్సు, దానికై నిరంతర పఠనం, పరిశీలనా, లేఖనం అవసరం. నేను రాసిన ఈ కథలు పాఠకుల్ని ఆకట్టుకుంటాయని, మనస్సుని హత్తుకుంటాయని భావిస్తున్నాను. సహృదయులైన పాఠకుల నుండి, విమర్శకుల నుండి సలహాల్ని, విమర్శలను, అభిప్రాయాలను కోరుకుంటూ... - మీ శైలి© 2017,www.logili.com All Rights Reserved.