అప్పుడే ఐదు దశాబ్దాలు గడిచిపోయాయి...! నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. గాయం కాని గాయం ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. చాలా చిన్నప్పుడు... ఇంచుమించుగా పసివయస్సు... నేను, చిన్నక్క ఆడుకుంటున్నాం... మా పనిమనిషి పరిగెత్తుకొచ్చి మీ నాన్న చనిపోయాడు అని చెప్పడం... అంతవరకూ మనిషి చనిపోయాడు అంటే తెలీని నేను... పరిగెత్తుకుంటూ ఇంటికెళితే నాన్నగారి భౌతికాయం చుట్టూ బిగ్గరగా ఏడుపులు... నన్ను చూసి 'అయ్యో సాయి వచ్చాడంటూ' మరింత బిగ్గరగా ఏడుపులు... ఇవన్నీ జరిగి యాభై సంవత్సరాలా!?
ఆ మరుసటి సంవత్సరమే - నాన్నగారి ఆప్తమిత్రులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు, శ్రీ పి.వి.నరసింహారావుగారు (మాజీ ప్రధాని), శ్రీ ఆవుల సాంబశివరావుగారు, రూపొందించిన 'గోపీచంద్ స్మారక సంచిక'(1963) నాన్నగారిని మళ్ళి సజీవులని చేసింది. నాన్నగారిని ఇప్పటికీ అభిమానులు తమ గుండెల్లో పదిల పరచుకునే విధంగా రూపొందించారు. ఈ పుస్తకంలో గోపీచంద్ జీవితం - సాహిత్యం - వ్యక్తిత్వం- ఆలోచనాధార - వ్యవహారశైలి - బహుముఖ ప్రజ్ఞ - కుటుంబ పూర్వాపరాలు - నాస్తిక హేతువాద మేధావులు సమగ్రంగా విశ్లేషించారు. ఏకంగా అయన మీద ఒక ఎన్సైక్లోపిడియాను తలపిస్తుంది. ఆనాడు అందరు ఈ పుస్తకాన్ని 'గోపిచందిజం' అన్నారు. నాకు మాత్రం ఈ పుస్తకం 'ఓ తపస్వి జీవయాత్ర'. గోపీచంద్ జీవించింది ఒక జీవితమా! అనేక జీవితాలా!? అని అనిపించక మానదు... అదీ అంత తక్కువ వయస్సులో!!
అందరూ తమ గుండెల్లో కలాన్ని ముంచి రాయడం ద్వారా ఇన్నాళ్ళయినా ఇంకా తడి ఆరలేదు. నాన్నగారి ఆత్మ ప్రతి వాక్యం లోనూ కనబడుతుంది. పదపదానికి నాన్నగారు దర్శన మిస్తారు. ఒకచోట నాన్నగారి సమకాలీకులు, ప్రఖ్యాత రచయిత శ్రీ బుచ్చిబాబుగారు. 'జీవిత రహస్యం తెలుసుకున్నాక యోగిగా మారి, రాతకు పూనుకున్నాడేమో' అని అంటారు. మరోచోట శ్రీ కాళోజి నారాయణరావుగారు 'మాసిపోని రాతకాడా!' అనీ, ఇంకోచోట శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు 'ఓ గొప్ప తండ్రి కడుపున పుట్టుట ఇంకొక్క గోపీచంద్' అనీ అలాగే సి.నారాయణరెడ్డిగారు 'మాట్లాడే మౌనిగా మాతో కొన్నాళ్ళు తిరిగావు - మళ్ళి బోధి వృక్షం కిందకీ చల్లగా వెళ్ళిపోయావు అని. ఇలా ఎన్నెన్నో ఈ పుస్తకాన్ని అజరామరం చేసాయి. నాన్నగారు వెళ్ళిపోయిన అర్థశతాబ్ది తరువాత ఈ పుస్తకాన్ని తెలుగువారికి అందించడం, గోపీచంద్ విశ్వమానవుడిగా... ఎప్పటికీ జీవిoచేట్టుగా చేసాయి.
- సాయిచంద్
అప్పుడే ఐదు దశాబ్దాలు గడిచిపోయాయి...! నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. గాయం కాని గాయం ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. చాలా చిన్నప్పుడు... ఇంచుమించుగా పసివయస్సు... నేను, చిన్నక్క ఆడుకుంటున్నాం... మా పనిమనిషి పరిగెత్తుకొచ్చి మీ నాన్న చనిపోయాడు అని చెప్పడం... అంతవరకూ మనిషి చనిపోయాడు అంటే తెలీని నేను... పరిగెత్తుకుంటూ ఇంటికెళితే నాన్నగారి భౌతికాయం చుట్టూ బిగ్గరగా ఏడుపులు... నన్ను చూసి 'అయ్యో సాయి వచ్చాడంటూ' మరింత బిగ్గరగా ఏడుపులు... ఇవన్నీ జరిగి యాభై సంవత్సరాలా!? ఆ మరుసటి సంవత్సరమే - నాన్నగారి ఆప్తమిత్రులు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు, శ్రీ పి.వి.నరసింహారావుగారు (మాజీ ప్రధాని), శ్రీ ఆవుల సాంబశివరావుగారు, రూపొందించిన 'గోపీచంద్ స్మారక సంచిక'(1963) నాన్నగారిని మళ్ళి సజీవులని చేసింది. నాన్నగారిని ఇప్పటికీ అభిమానులు తమ గుండెల్లో పదిల పరచుకునే విధంగా రూపొందించారు. ఈ పుస్తకంలో గోపీచంద్ జీవితం - సాహిత్యం - వ్యక్తిత్వం- ఆలోచనాధార - వ్యవహారశైలి - బహుముఖ ప్రజ్ఞ - కుటుంబ పూర్వాపరాలు - నాస్తిక హేతువాద మేధావులు సమగ్రంగా విశ్లేషించారు. ఏకంగా అయన మీద ఒక ఎన్సైక్లోపిడియాను తలపిస్తుంది. ఆనాడు అందరు ఈ పుస్తకాన్ని 'గోపిచందిజం' అన్నారు. నాకు మాత్రం ఈ పుస్తకం 'ఓ తపస్వి జీవయాత్ర'. గోపీచంద్ జీవించింది ఒక జీవితమా! అనేక జీవితాలా!? అని అనిపించక మానదు... అదీ అంత తక్కువ వయస్సులో!! అందరూ తమ గుండెల్లో కలాన్ని ముంచి రాయడం ద్వారా ఇన్నాళ్ళయినా ఇంకా తడి ఆరలేదు. నాన్నగారి ఆత్మ ప్రతి వాక్యం లోనూ కనబడుతుంది. పదపదానికి నాన్నగారు దర్శన మిస్తారు. ఒకచోట నాన్నగారి సమకాలీకులు, ప్రఖ్యాత రచయిత శ్రీ బుచ్చిబాబుగారు. 'జీవిత రహస్యం తెలుసుకున్నాక యోగిగా మారి, రాతకు పూనుకున్నాడేమో' అని అంటారు. మరోచోట శ్రీ కాళోజి నారాయణరావుగారు 'మాసిపోని రాతకాడా!' అనీ, ఇంకోచోట శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారు 'ఓ గొప్ప తండ్రి కడుపున పుట్టుట ఇంకొక్క గోపీచంద్' అనీ అలాగే సి.నారాయణరెడ్డిగారు 'మాట్లాడే మౌనిగా మాతో కొన్నాళ్ళు తిరిగావు - మళ్ళి బోధి వృక్షం కిందకీ చల్లగా వెళ్ళిపోయావు అని. ఇలా ఎన్నెన్నో ఈ పుస్తకాన్ని అజరామరం చేసాయి. నాన్నగారు వెళ్ళిపోయిన అర్థశతాబ్ది తరువాత ఈ పుస్తకాన్ని తెలుగువారికి అందించడం, గోపీచంద్ విశ్వమానవుడిగా... ఎప్పటికీ జీవిoచేట్టుగా చేసాయి. - సాయిచంద్© 2017,www.logili.com All Rights Reserved.