సమాజంలో మన చుట్టూ తిరుగుతున్నా మనం అంతగా పట్టించుకోని బడుగు జీవుల బ్రతుకు వెతలు ఈ కథా వస్తువులై శిల్ప పరిణతితో మన ముందుకొస్తున్నాయి. ప్రాపంచిక దృక్పథంలో ఒక ప్రత్యేక పార్శ్వం ఇది! కుడిఎడమల దగాని రుచి చూసి, కడకు ఆ జీవికలోనే 'తగినంత' సంపాదన సాధించవచ్చుననే అనుభవపూర్వక జ్ఞానోదయాన్ని పొందుతారు.
సమాజం అస్తవ్యస్తంగా ఉంది. సమస్యలు సంకీర్ణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భాహ్యంగా కొందరికి నీచంగా, హేయంగా కనిపించే భిక్షాటన వంటి జీవికల్ని బరువుగా మోస్తున్న వారి అంతరంగ చిత్రణ. ఇలాంటి సామజిక దౌర్భాగ్యాన్ని లోపొరల్లోకి తవ్వుకుంటూ పోతే - ఋషి మూలం సామెత వెన్ను చరుస్తుంది అనే నీతిని, హెచ్చరికనీ అందిస్తుంది ఈ కథ!
-కన్నెగంటి అనసూయ
సమాజంలో మన చుట్టూ తిరుగుతున్నా మనం అంతగా పట్టించుకోని బడుగు జీవుల బ్రతుకు వెతలు ఈ కథా వస్తువులై శిల్ప పరిణతితో మన ముందుకొస్తున్నాయి. ప్రాపంచిక దృక్పథంలో ఒక ప్రత్యేక పార్శ్వం ఇది! కుడిఎడమల దగాని రుచి చూసి, కడకు ఆ జీవికలోనే 'తగినంత' సంపాదన సాధించవచ్చుననే అనుభవపూర్వక జ్ఞానోదయాన్ని పొందుతారు. సమాజం అస్తవ్యస్తంగా ఉంది. సమస్యలు సంకీర్ణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో భాహ్యంగా కొందరికి నీచంగా, హేయంగా కనిపించే భిక్షాటన వంటి జీవికల్ని బరువుగా మోస్తున్న వారి అంతరంగ చిత్రణ. ఇలాంటి సామజిక దౌర్భాగ్యాన్ని లోపొరల్లోకి తవ్వుకుంటూ పోతే - ఋషి మూలం సామెత వెన్ను చరుస్తుంది అనే నీతిని, హెచ్చరికనీ అందిస్తుంది ఈ కథ! -కన్నెగంటి అనసూయ© 2017,www.logili.com All Rights Reserved.