అనగనగా ఒక బాతు. దానిదో వింత మనస్తత్వం. దానికి ఏ ఇతర పక్షిని, జంతువును చూసినా అసూయ. వాటితో కయ్యానికి కాలు దువ్వేది. వాటిని గుర్రుగా చూసేది. అవన్నీ తమ తలలు విదిల్చి ఇలా అనేవి : "ఏం బాతమ్మా!"
ఒక రోజు చెరువులో ఒక హంసను చూసింది. దాని పొడవైన మెడను చూసి ముచ్చట పడింది. నాకూ అలాంటి మెడ ఉంటేనా అనుకుంది.
ఆ హంసతో ఇలా అంది : "నీ మెడను నాకివ్వు, బదులుగా ణా మెడను నీకిస్తాను." హంస కాసేపు అలోచించి 'సరే' అంది. రెండూ మెడలను మార్చుకున్నాయి.కానీ బాతుకు ఆ పొడవైన మేడతో ఏం చేయాలో తెలియలేదు. అటు తిప్పింది. ఇటు తిప్పింది. సాగదీసింది. కానీ ఏమీ లాభంగా అనిపించలేదు.
ఒక గూడకొంగ ఈ బాతు చేష్టలను చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. " నువ్వు అటు బాతువి కాదు ఇటు హంసవి కాదు" అంటూ నవ్వింది. బాతుకు దాని నవ్వు చూసి కోపం వచ్చింది. పోట్లాదదామన్నంతలో గూడకొంగ ముక్కు కింద సంచి దాని కంట పడింది.
"నాకు కూడా ముక్కు కింద వేలాడే సంచి ఉంటే" అనుకుంది. ఇక తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!
"రకరకాల బండి చక్రాలు" అనే కథ కుడా ఇందులో ఉంది. ఇది రెండు పుస్తకాల సెట్.
- వి. సుతయేవ్
అనగనగా ఒక బాతు. దానిదో వింత మనస్తత్వం. దానికి ఏ ఇతర పక్షిని, జంతువును చూసినా అసూయ. వాటితో కయ్యానికి కాలు దువ్వేది. వాటిని గుర్రుగా చూసేది. అవన్నీ తమ తలలు విదిల్చి ఇలా అనేవి : "ఏం బాతమ్మా!" ఒక రోజు చెరువులో ఒక హంసను చూసింది. దాని పొడవైన మెడను చూసి ముచ్చట పడింది. నాకూ అలాంటి మెడ ఉంటేనా అనుకుంది. ఆ హంసతో ఇలా అంది : "నీ మెడను నాకివ్వు, బదులుగా ణా మెడను నీకిస్తాను." హంస కాసేపు అలోచించి 'సరే' అంది. రెండూ మెడలను మార్చుకున్నాయి.కానీ బాతుకు ఆ పొడవైన మేడతో ఏం చేయాలో తెలియలేదు. అటు తిప్పింది. ఇటు తిప్పింది. సాగదీసింది. కానీ ఏమీ లాభంగా అనిపించలేదు. ఒక గూడకొంగ ఈ బాతు చేష్టలను చూసి నవ్వు ఆపుకోలేకపోయింది. " నువ్వు అటు బాతువి కాదు ఇటు హంసవి కాదు" అంటూ నవ్వింది. బాతుకు దాని నవ్వు చూసి కోపం వచ్చింది. పోట్లాదదామన్నంతలో గూడకొంగ ముక్కు కింద సంచి దాని కంట పడింది. "నాకు కూడా ముక్కు కింద వేలాడే సంచి ఉంటే" అనుకుంది. ఇక తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! "రకరకాల బండి చక్రాలు" అనే కథ కుడా ఇందులో ఉంది. ఇది రెండు పుస్తకాల సెట్. - వి. సుతయేవ్© 2017,www.logili.com All Rights Reserved.