కుప్ప నూర్పిళ్ళు అయిపోయినాంక మాగాట్లో పరిగేరుకునీ, ఖాళీ అయిన కళ్ళాలను ఊడ్సుకునీ ఒకటో అరో కుంచాల వొడ్లు పోగేసుకుని కొంటింటికి పోతే తప్పుడు తక్కెడతో, తక్కువ లెక్కలతో మా పసి చేతుల కష్టాన్ని దోచుకుంటుంటే నోరు మెదపలేక గుడ్లలో నీళ్ళు కుక్కుకున్న బాల్యాలు మావి.
కటికపూలు.. మా తిండినీ, బతుకుల్నీ, కట్టూ మాటల్నీ కటికతనంగా ప్రచారం చేసి, మాసం కోసే వృత్తిలో ఈ సమాజానికి వేల ఏళ్లగా సేవ చేసిన జనాలకు కటికోళ్ళు అని పేరు పెట్టి, ఆ పేరునే ఒక అవమానకరమైన పద ప్రయోగంగా వాడుకుంటున్న ఈ సమాజపు విలువల వ్యవస్థకు మా కటికతనంలో ఉన్నా నికార్సుతనాన్నీ, నిజాయితీనీ, నేలతనాన్నీ, మాకే సొంతమైన ఆకలినీ, పంచుకు తినే మనస్తత్వాన్నీ, కన్నీళ్ళనూ, కరుణనూ, మమ్మల్ని దోచుకోవడానికి వాళ్ళకు వేలాది ఏళ్లగా ఉపయోగపడ్డ అమాయకత్వాన్నీ, దాన్నుండి రోజు కూలిగా దొరికే అవమానాలనూ కలిపి ఒక్క మాటలో చెప్పే ప్రయత్నమే ఈ శీర్షిక.
కుప్ప నూర్పిళ్ళు అయిపోయినాంక మాగాట్లో పరిగేరుకునీ, ఖాళీ అయిన కళ్ళాలను ఊడ్సుకునీ ఒకటో అరో కుంచాల వొడ్లు పోగేసుకుని కొంటింటికి పోతే తప్పుడు తక్కెడతో, తక్కువ లెక్కలతో మా పసి చేతుల కష్టాన్ని దోచుకుంటుంటే నోరు మెదపలేక గుడ్లలో నీళ్ళు కుక్కుకున్న బాల్యాలు మావి. కటికపూలు.. మా తిండినీ, బతుకుల్నీ, కట్టూ మాటల్నీ కటికతనంగా ప్రచారం చేసి, మాసం కోసే వృత్తిలో ఈ సమాజానికి వేల ఏళ్లగా సేవ చేసిన జనాలకు కటికోళ్ళు అని పేరు పెట్టి, ఆ పేరునే ఒక అవమానకరమైన పద ప్రయోగంగా వాడుకుంటున్న ఈ సమాజపు విలువల వ్యవస్థకు మా కటికతనంలో ఉన్నా నికార్సుతనాన్నీ, నిజాయితీనీ, నేలతనాన్నీ, మాకే సొంతమైన ఆకలినీ, పంచుకు తినే మనస్తత్వాన్నీ, కన్నీళ్ళనూ, కరుణనూ, మమ్మల్ని దోచుకోవడానికి వాళ్ళకు వేలాది ఏళ్లగా ఉపయోగపడ్డ అమాయకత్వాన్నీ, దాన్నుండి రోజు కూలిగా దొరికే అవమానాలనూ కలిపి ఒక్క మాటలో చెప్పే ప్రయత్నమే ఈ శీర్షిక.© 2017,www.logili.com All Rights Reserved.