'నరుడు - నక్షత్రాలు' అనే శీర్షిక కింద వెలువరింపబడిన వ్యాసాలు చదువగా స్పష్టంగా కలిగే అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. మొదట ఈ ప్రయత్నం తెలుగులో అతి నూతనం అనే విషయం బోధపడుతుంది. వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియగా పరిపూర్ణతను ఇప్పుడిప్పుడే సంతరించుకుంటున్నది. ఏవేవో సాహిత్య విషయాలపై చర్చల రూపంలో తప్ప ఆ ప్రక్రియను క్షుణ్ణంగా ఉపయోగించుకోవడం ఇంతవరకూ గమనించదగినంతగా జరగలేదనే చెప్పాలి. మానవ విజ్ఞానంలో శరవేగంతో వస్తున్న మార్పులనూ, పరిణామాలనూ వివరించడానికి వ్యాసంకన్నా బలమైన సాధనం మరొకటి లేదనే విషయం నిర్వివాదం. అందువల్ల వివిధ విషయాలను గురించి వ్రాయబడి పఠితృ లోకంలో ఆలోచనలను రేకేత్తించగల ఈ వ్యాస పరంపర అత్యంత శ్లాఘనీయమైన ప్రయత్నం.
ఈ వ్యాసలన్నిటిలో మరొక కలం ముఖ్యలక్షణం ఉంది. ప్రతిశీర్షిక కిందా, ఏదో ఒక అపూర్వ విషయాన్నో లేదా ఒక సిద్ధాంతాన్నో ప్రతిపాదించడం జరిగింది. 'ఏదో అపూర్వ విషయాన్ని అపూర్వ ధోరణిలో చెప్పవలసి వచ్చినప్పుడే కలం చేపట్టాలి' అనే నియమాన్ని గ్రంథకర్త పాటిస్తున్నట్టు ద్యోతకం అవుతుంది. అది విశేషమే. అందువల్ల నే ఈ ప్రయత్నం అత్యంత అభిశాలనీయం, రచయిత మనలో ఆలోచనలను రేకేత్తించగల మరెన్నో రచనలు చేయగలరని ఆకాంక్ష.
- పెద్దిభొట్ల సుబ్బరామయ్య
'నరుడు - నక్షత్రాలు' అనే శీర్షిక కింద వెలువరింపబడిన వ్యాసాలు చదువగా స్పష్టంగా కలిగే అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి. మొదట ఈ ప్రయత్నం తెలుగులో అతి నూతనం అనే విషయం బోధపడుతుంది. వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియగా పరిపూర్ణతను ఇప్పుడిప్పుడే సంతరించుకుంటున్నది. ఏవేవో సాహిత్య విషయాలపై చర్చల రూపంలో తప్ప ఆ ప్రక్రియను క్షుణ్ణంగా ఉపయోగించుకోవడం ఇంతవరకూ గమనించదగినంతగా జరగలేదనే చెప్పాలి. మానవ విజ్ఞానంలో శరవేగంతో వస్తున్న మార్పులనూ, పరిణామాలనూ వివరించడానికి వ్యాసంకన్నా బలమైన సాధనం మరొకటి లేదనే విషయం నిర్వివాదం. అందువల్ల వివిధ విషయాలను గురించి వ్రాయబడి పఠితృ లోకంలో ఆలోచనలను రేకేత్తించగల ఈ వ్యాస పరంపర అత్యంత శ్లాఘనీయమైన ప్రయత్నం. ఈ వ్యాసలన్నిటిలో మరొక కలం ముఖ్యలక్షణం ఉంది. ప్రతిశీర్షిక కిందా, ఏదో ఒక అపూర్వ విషయాన్నో లేదా ఒక సిద్ధాంతాన్నో ప్రతిపాదించడం జరిగింది. 'ఏదో అపూర్వ విషయాన్ని అపూర్వ ధోరణిలో చెప్పవలసి వచ్చినప్పుడే కలం చేపట్టాలి' అనే నియమాన్ని గ్రంథకర్త పాటిస్తున్నట్టు ద్యోతకం అవుతుంది. అది విశేషమే. అందువల్ల నే ఈ ప్రయత్నం అత్యంత అభిశాలనీయం, రచయిత మనలో ఆలోచనలను రేకేత్తించగల మరెన్నో రచనలు చేయగలరని ఆకాంక్ష. - పెద్దిభొట్ల సుబ్బరామయ్య© 2017,www.logili.com All Rights Reserved.