భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీ భాషకు వున్న ప్రత్యేకతలను గుర్తించిన పూజ్య బాపూజీ దానిని రాష్ట్ర భాషగా ప్రకటించారు. ఆయన హిందీ ప్రచారానికి ఎంతో కృషి చేశారు. స్వాతంత్రోద్యమంలో కూడ హిందీ ప్రచారం ఒక ప్రముఖ అంశంగా వుండినది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీ అధికారభాషగా నిర్ణయింపబడింది. హిందీ భాషాభివృద్దికి, ప్రచారానికి అన్ని ప్రణాలికలు అమలుచేయబడ్డాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడని రాష్ట్రలలో హిందీ భాషా ప్రచారానికి అధిక ప్రోత్సాహం ఇవ్వబడింది. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు, సైనికులు, యాత్రికులు మొ" విభిన్న తరగతుల ప్రజల అవసరాలు దృష్టిలో వుంచుకొని వారికి ఉపయోగపడే విధంగా ఈ నిఘంటువు సిద్దపరచ బడింది. అనుబంధంలో దైనందిన జీవితంలో అవసరమైన కొన్ని పదాలకు సమాన అర్ధమిచ్చు హిందీ మాటలు ఇవ్వబడినవి. హిందీ ప్రాంతాల్లో వుంటున్న తెలుగు వారికి ఈ నిఘంటువు చాల ఉపయోగకరంగా వుంటుందని నమ్ముతున్నాము. ఎంతో శ్రమపడి ఈ డిక్షనరీని అందించిన కిన్నెర రూబెన్ గారికి మా కృతఙ్ఞతలు.
కె. రూబెన్
భారతదేశంలో అనుసంధాన భాషగా హిందీ భాషకు వున్న ప్రత్యేకతలను గుర్తించిన పూజ్య బాపూజీ దానిని రాష్ట్ర భాషగా ప్రకటించారు. ఆయన హిందీ ప్రచారానికి ఎంతో కృషి చేశారు. స్వాతంత్రోద్యమంలో కూడ హిందీ ప్రచారం ఒక ప్రముఖ అంశంగా వుండినది. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత హిందీ అధికారభాషగా నిర్ణయింపబడింది. హిందీ భాషాభివృద్దికి, ప్రచారానికి అన్ని ప్రణాలికలు అమలుచేయబడ్డాయి. ముఖ్యంగా హిందీ మాట్లాడని రాష్ట్రలలో హిందీ భాషా ప్రచారానికి అధిక ప్రోత్సాహం ఇవ్వబడింది. విద్యార్ధులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు, సైనికులు, యాత్రికులు మొ" విభిన్న తరగతుల ప్రజల అవసరాలు దృష్టిలో వుంచుకొని వారికి ఉపయోగపడే విధంగా ఈ నిఘంటువు సిద్దపరచ బడింది. అనుబంధంలో దైనందిన జీవితంలో అవసరమైన కొన్ని పదాలకు సమాన అర్ధమిచ్చు హిందీ మాటలు ఇవ్వబడినవి. హిందీ ప్రాంతాల్లో వుంటున్న తెలుగు వారికి ఈ నిఘంటువు చాల ఉపయోగకరంగా వుంటుందని నమ్ముతున్నాము. ఎంతో శ్రమపడి ఈ డిక్షనరీని అందించిన కిన్నెర రూబెన్ గారికి మా కృతఙ్ఞతలు. కె. రూబెన్© 2017,www.logili.com All Rights Reserved.