ఇది నా ప్రార్థన ప్రభూ! నా హృదయంలో పేదరికాన్ని వేళ్ళతో సహా పెకలించు.
బాధలను, ఆనందాలను తేలికగా తీసుకునే బలమివ్వు నాకు.
సేవలో ప్రేమ సాఫల్యం పొందించుకునే బలమివ్వు.
ఎప్పుడు పేదలను నిర్లక్ష్యం చేయకుండానూ, దగాపడిన వారి ముందు వంగకుండానూ బలమివ్వు.
ప్రతి రోజు తారసపడే సమస్యలను ఎదుర్కొనే మన స్థైర్యం ఇవ్వు.
నీ ఇష్టానికి, నా ధైర్యం ప్రేమతో లొంగిపోయే బలమివ్వు.
అనంతున్ని చేశావు నన్ను. అలాంటిది నీ సంతోషం. ఈ పనికి రాని పాత్రను పదే పదే ఖాళి చేసి,
నవజీవంతో నింపుతావు.
ఈ చిన్ని పిల్లన గ్రోవిని నీతోపాటు కొండల్లోకి, కోనల్లోకి తీసుకెళ్ళి శాశ్వతమైన కొత్త రాగాలతో ఊపిరి పోస్తావు.
నీ హస్తాల అమృత స్పర్శతో నా చిన్ని హృదయం ఆనందంతో అవధులు దాటి పైకి చెప్పలేని భాషలో మాట్లాడుతుంది.
నీ అంతు లేని కానుకలు నా ఈ చిన్ని చేతులకు అందుతుంటాయి. యుగాలు గడుస్తాయి. నీవు కుమ్మరిస్తునే ఉంటావు. ఇంకా నింపటానికి ఖాళి ఉంటూనే ఉంటుంది.
-భార్గవి.
ఇది నా ప్రార్థన ప్రభూ! నా హృదయంలో పేదరికాన్ని వేళ్ళతో సహా పెకలించు. బాధలను, ఆనందాలను తేలికగా తీసుకునే బలమివ్వు నాకు. సేవలో ప్రేమ సాఫల్యం పొందించుకునే బలమివ్వు. ఎప్పుడు పేదలను నిర్లక్ష్యం చేయకుండానూ, దగాపడిన వారి ముందు వంగకుండానూ బలమివ్వు. ప్రతి రోజు తారసపడే సమస్యలను ఎదుర్కొనే మన స్థైర్యం ఇవ్వు. నీ ఇష్టానికి, నా ధైర్యం ప్రేమతో లొంగిపోయే బలమివ్వు. అనంతున్ని చేశావు నన్ను. అలాంటిది నీ సంతోషం. ఈ పనికి రాని పాత్రను పదే పదే ఖాళి చేసి, నవజీవంతో నింపుతావు. ఈ చిన్ని పిల్లన గ్రోవిని నీతోపాటు కొండల్లోకి, కోనల్లోకి తీసుకెళ్ళి శాశ్వతమైన కొత్త రాగాలతో ఊపిరి పోస్తావు. నీ హస్తాల అమృత స్పర్శతో నా చిన్ని హృదయం ఆనందంతో అవధులు దాటి పైకి చెప్పలేని భాషలో మాట్లాడుతుంది. నీ అంతు లేని కానుకలు నా ఈ చిన్ని చేతులకు అందుతుంటాయి. యుగాలు గడుస్తాయి. నీవు కుమ్మరిస్తునే ఉంటావు. ఇంకా నింపటానికి ఖాళి ఉంటూనే ఉంటుంది. -భార్గవి.
© 2017,www.logili.com All Rights Reserved.