వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు
సహస్ర ఆనంద బంధాలలో
స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది.
ఈ మృణ్మయ పాత్రని అంచుదాకా నింపుతో
వివిధ వర్ణ సురభిళ నూతన మధుధారని
నాకై నువ్వు వర్షిస్తావు.
నీ జ్వాలతో నా ప్రపంచం
తన సహస్ర దీపాల్ని వెలిగించుకొని
నీ ఆలయంలోని పూజాపీఠం ముందు అర్పిస్తుంది.
నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను.
నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు
నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి
నా భ్రమలన్నీ ఆనందహారతులుగా మండిపోతాయి.
నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తాయి.
వైరాగ్యం లోంచి మోక్షం నా కవసరం లేదు సహస్ర ఆనంద బంధాలలో స్వతంత్రం నన్నాలింగనం చేసుకుంటుంది. ఈ మృణ్మయ పాత్రని అంచుదాకా నింపుతో వివిధ వర్ణ సురభిళ నూతన మధుధారని నాకై నువ్వు వర్షిస్తావు. నీ జ్వాలతో నా ప్రపంచం తన సహస్ర దీపాల్ని వెలిగించుకొని నీ ఆలయంలోని పూజాపీఠం ముందు అర్పిస్తుంది. నా జ్ఞానేంద్రియ ద్వారాల్ని ఎన్నడూ మూయను. నా దృష్టి శ్రావణ స్పర్శనానుభవాలు నీ ఆనందాన్ని తీసుకొచ్చి నా కిస్తాయి నా భ్రమలన్నీ ఆనందహారతులుగా మండిపోతాయి. నా వాంఛలన్నీ ప్రేమలో ఫలిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.