మహానటులు, ప్రజానాయకులు
నందమూరి తారక రామారావుగారి
శతజయంతి
ఒక రాముడెవరంటే... ఒక కృష్ణుడెవరంటే... మహావిష్ణువెవరంటే... భీష్మాచార్యుడెవరంటే... మహావీరుడు అర్జునుడెవరంటే... బాహుబలుడు భీముడెవరంటే... దానవీరశూర కర్ణుడెవరంటే... అలాగే పురాణాలలో సుప్రసిద్ధ పాత్రలు ఒక సుయోధనుడెవరంటే... రామాయణంలో రావణబ్రహ్మ ఎవరంటే... ఇంద్రజిత్తు ఎవరంటే- అన్నింటికీ సమాధానం సౌజన్యరూపం నందమూరి తారక రామారావుగారిదే.
పురాణ పురుషులు అంటే, దేవతల చిత్రాలు మనకు షాపుల్లో దొరికేవి. నందమూరి తారక రామారావుగారు శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా పాత్రలు ధరించిన తర్వాత ఆ దేవతలకు మారుగా నందమూరి వారి ఫోటోలు వచ్చాయి. నందమూరి శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి గుడులు కట్టి పూజలు చేసే అభిమానులు కోకొల్లలుగా తయారయ్యారు. దేవుళ్లు ఎలా వున్నారో ఎవరికీ తెలియదు కాని నందమూరి వారి రూపాన్ని చూసి పరవశులయ్యారు. దేవుళ్లు కూడా వీరిలాగ వుండవలసిందే నన్న అభిప్రాయానికొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ గారు సైతం 'స్వామీజీ' అని నమస్కరించిన సందర్భాలున్నాయి............
మహానటులు, ప్రజానాయకులు నందమూరి తారక రామారావుగారి శతజయంతి ఒక రాముడెవరంటే... ఒక కృష్ణుడెవరంటే... మహావిష్ణువెవరంటే... భీష్మాచార్యుడెవరంటే... మహావీరుడు అర్జునుడెవరంటే... బాహుబలుడు భీముడెవరంటే... దానవీరశూర కర్ణుడెవరంటే... అలాగే పురాణాలలో సుప్రసిద్ధ పాత్రలు ఒక సుయోధనుడెవరంటే... రామాయణంలో రావణబ్రహ్మ ఎవరంటే... ఇంద్రజిత్తు ఎవరంటే- అన్నింటికీ సమాధానం సౌజన్యరూపం నందమూరి తారక రామారావుగారిదే. పురాణ పురుషులు అంటే, దేవతల చిత్రాలు మనకు షాపుల్లో దొరికేవి. నందమూరి తారక రామారావుగారు శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా పాత్రలు ధరించిన తర్వాత ఆ దేవతలకు మారుగా నందమూరి వారి ఫోటోలు వచ్చాయి. నందమూరి శ్రీరాముడికి, శ్రీకృష్ణుడికి గుడులు కట్టి పూజలు చేసే అభిమానులు కోకొల్లలుగా తయారయ్యారు. దేవుళ్లు ఎలా వున్నారో ఎవరికీ తెలియదు కాని నందమూరి వారి రూపాన్ని చూసి పరవశులయ్యారు. దేవుళ్లు కూడా వీరిలాగ వుండవలసిందే నన్న అభిప్రాయానికొచ్చారంటే అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్తున్నానంటే భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్సింగ్ గారు సైతం 'స్వామీజీ' అని నమస్కరించిన సందర్భాలున్నాయి............© 2017,www.logili.com All Rights Reserved.