ఎస్.వి.రంగారావు గారు ఎంత గొప్ప నటుడో అంత గొప్పగా ఉంది ఈ పుస్తకం! ఫోటో బియోగ్రఫీలు ఇంతకముందు నేనెప్పుడూ చూడలేదు. అందుకే ఓ కొత్త అనుభూతికి లోనయ్యాను. ఈ పుస్తకం తిరగేస్తుంటే రంగారావు గారి జీవితంతో పాటు మనము ప్రయాణిస్తున్నట్లుంది. ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులు మళ్ళీ మన ముందు జరుగుతున్నట్లనిపించింది! ఎప్పుడో ఏభై అరవై ఏళ్ళ క్రితం నటుడుగా ఓ వెలుగు వెలిగిన రంగారావు గారి గుంరించి ఇప్పటి జనరేషన్ కు చెందిన సంజయ్ కిషోర్ ఇంత గొప్పగా పరిశోధన చేసి , ఓ ఫోటో బయోగ్రఫీ పుస్తకం తేవడం నిజంగా ఆ మహానటుడికి గొప్ప నివాళి అని చెప్పవచ్చు! ఇన్ని ఫోటోలు సేకరించడం, వాటిని ఓ క్రమ పద్దతిలో కూర్పు చెయ్యడం... ప్రతి పేజీని అందంగా తీర్చిదిదండం.... ఇవన్నీ చెయ్యాలంటే ఓర్పు , నేర్పు, అభిరుచి, సృజనాత్మకత ఉండాలి! ఇవన్నీ సంజయ్ కిషోర్ లో ఉండబట్టే చరిత్రలో నిలిచిపోయేలా ఈ పుస్తకాన్ని రూపొందించగలిగారు. Hatssoff To Sanjay Kishore సినిమా ని అభిమానించే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండాలిసిన పుస్తకమిది.