తెలుగు నాట సాహిత్య విమర్శాదీపం బహు చిన్నది" అని కట్టమంచి రామ లింగారెడ్డి సాహిత్య విమర్శ గురించి అన్నారు కానీ తెలుగు సినీ విమర్శకి వస్తే అసలు దీపం ఇంకా వెలగనే లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో యాభయి ఏళ్ళ క్రితం సినిమాను ఒక సాహిత్య రూపంగా భావించి నిరపేక్షంగా కొడవటిగంటి కుటుంబరావు చేసిన విమర్శ, అప్పుడప్పుడు వి. రాజారామమోహన్ రావు, మైనంపాటి భాస్కర్, సికిందర్, సత్యమూర్తి లాంటి వాళ్ళు రాసిన సినిమా వ్యాసాలు ఇందుకు మినహాయింపు. సినీ పత్రికలు అయిన జ్యోతి చిత్ర, సితార, సినిమా పత్రిక, శివరంజని లలో రెగ్యులర్గా వచ్చిన రివ్యూలు కేవలం సమీక్షలు తప్పిస్తే సమగ్రమైన విమర్శ కాదు. నిజానికి సమీక్షా వ్యాసానికి, విమర్శకి చాలా తేడా వుంది. సమీక్ష పైపైన ఫెరిఫెరల్గా ఉంటే విమర్శ సమగ్రంగా ఉంటుంది.
సమీక్ష చేయడానికి ఒక సినిమా చూసి అర్ధం చేసుకునే స్థాయి ఉంటే చాలు. కానీ ఒక సినిమాను సమగ్రంగా పాఠకుడి కళ్ళముందు నిలిపి దాని గుణదోషాలు చేయాలి అంటే విమర్శకుడికి చాలా అధ్యయనం ఉండాలి. ప్రపంచ సినిమా గురించి, తనభాషలో అంతకుముందు వచ్చిన సినిమాల గురించి, సాహిత్యం, సంగీతం, సినిమా నిర్మాణం మీద.....................
తెలుగు నాట సాహిత్య విమర్శాదీపం బహు చిన్నది" అని కట్టమంచి రామ లింగారెడ్డి సాహిత్య విమర్శ గురించి అన్నారు కానీ తెలుగు సినీ విమర్శకి వస్తే అసలు దీపం ఇంకా వెలగనే లేదు అంటే అతిశయోక్తి కాదు. ఎప్పుడో యాభయి ఏళ్ళ క్రితం సినిమాను ఒక సాహిత్య రూపంగా భావించి నిరపేక్షంగా కొడవటిగంటి కుటుంబరావు చేసిన విమర్శ, అప్పుడప్పుడు వి. రాజారామమోహన్ రావు, మైనంపాటి భాస్కర్, సికిందర్, సత్యమూర్తి లాంటి వాళ్ళు రాసిన సినిమా వ్యాసాలు ఇందుకు మినహాయింపు. సినీ పత్రికలు అయిన జ్యోతి చిత్ర, సితార, సినిమా పత్రిక, శివరంజని లలో రెగ్యులర్గా వచ్చిన రివ్యూలు కేవలం సమీక్షలు తప్పిస్తే సమగ్రమైన విమర్శ కాదు. నిజానికి సమీక్షా వ్యాసానికి, విమర్శకి చాలా తేడా వుంది. సమీక్ష పైపైన ఫెరిఫెరల్గా ఉంటే విమర్శ సమగ్రంగా ఉంటుంది. సమీక్ష చేయడానికి ఒక సినిమా చూసి అర్ధం చేసుకునే స్థాయి ఉంటే చాలు. కానీ ఒక సినిమాను సమగ్రంగా పాఠకుడి కళ్ళముందు నిలిపి దాని గుణదోషాలు చేయాలి అంటే విమర్శకుడికి చాలా అధ్యయనం ఉండాలి. ప్రపంచ సినిమా గురించి, తనభాషలో అంతకుముందు వచ్చిన సినిమాల గురించి, సాహిత్యం, సంగీతం, సినిమా నిర్మాణం మీద.....................© 2017,www.logili.com All Rights Reserved.