కవిత్వం అంటే రిథమిక్ మొనాటనీయేనా. వచన కవిత్వమంటే కేవలం లయాత్మక రొడ్డకొట్టుడేనా. కవిత్వం అనుభూతి ప్రధానం మాత్రమేనా. అవుననిపించే అనాది మూఢనమ్మకాలలో, కవిత్వం మనసును రంజింపజేయాలి అనే తప్పుడు సదాచారాలతో దేహం లోపలి లలిత లలిత సిరలనూ, సున్నిత మధుర ధమనులనూ కవిత్వం గిలిగింతలు పెట్టాలనే అర్థం పర్థం లేని సత్సాంప్రదాయాలలో గిలగిలలాడాల్సిందేనా.. వచన కవిత్వం అనుభూతిని మించిన తాత్వికతను ప్రకటించాలి కదా. కవిత్వం ఒక అనంత అగాథ సాంద్ర తాత్వికతకు ప్రతిరూప ప్రకటన అయి వుండాలి కదా. లోకాన్ని లోకంలోని విషాదానందాలను జీవన తాత్విక నిఘంటువులోంచి ప్రతిపదార్థాలుగా కవిత్వం విడమర్చాలి కదా. అలా ఎందుకు లేదు.
అలా ఎందుకు జరగడం లేదు. పూలనివ్వగలంగానీ పరిమళాన్నెలా నేర్పగలం. దృశ్యాన్నివ్వగలం గాని దృష్టినెలా ఇవ్వగలం. నాసికాంతర్భాగాలు మరీ ముఖ్యంగా మానసికాంతర్భాగాలు కదా శుభ్రంగా ఉండాల్సింది. భావజాలాన్ని నేర్పగలంగానీ చైతన్యాన్నెలా ఇవ్వగలం. మెదడుకదా నెత్తురై ఉరమాల్సింది. నమ్మరులేకాని నివురు నిప్పును బుగ్గి చేస్తుంది. నియమం కొత్త అడుగును కోసేస్తుంది. ఆకాశంలో పక్షి నడకకులాగ కొన్ని నడకలకు పాదముద్రలుండవు. ఇరుకు తరాజుల కురచ తూనికరాళ్ల వైశాల్యానిదే తప్పంతా..
- ప్రసేన్
కవిత్వం అంటే రిథమిక్ మొనాటనీయేనా. వచన కవిత్వమంటే కేవలం లయాత్మక రొడ్డకొట్టుడేనా. కవిత్వం అనుభూతి ప్రధానం మాత్రమేనా. అవుననిపించే అనాది మూఢనమ్మకాలలో, కవిత్వం మనసును రంజింపజేయాలి అనే తప్పుడు సదాచారాలతో దేహం లోపలి లలిత లలిత సిరలనూ, సున్నిత మధుర ధమనులనూ కవిత్వం గిలిగింతలు పెట్టాలనే అర్థం పర్థం లేని సత్సాంప్రదాయాలలో గిలగిలలాడాల్సిందేనా.. వచన కవిత్వం అనుభూతిని మించిన తాత్వికతను ప్రకటించాలి కదా. కవిత్వం ఒక అనంత అగాథ సాంద్ర తాత్వికతకు ప్రతిరూప ప్రకటన అయి వుండాలి కదా. లోకాన్ని లోకంలోని విషాదానందాలను జీవన తాత్విక నిఘంటువులోంచి ప్రతిపదార్థాలుగా కవిత్వం విడమర్చాలి కదా. అలా ఎందుకు లేదు. అలా ఎందుకు జరగడం లేదు. పూలనివ్వగలంగానీ పరిమళాన్నెలా నేర్పగలం. దృశ్యాన్నివ్వగలం గాని దృష్టినెలా ఇవ్వగలం. నాసికాంతర్భాగాలు మరీ ముఖ్యంగా మానసికాంతర్భాగాలు కదా శుభ్రంగా ఉండాల్సింది. భావజాలాన్ని నేర్పగలంగానీ చైతన్యాన్నెలా ఇవ్వగలం. మెదడుకదా నెత్తురై ఉరమాల్సింది. నమ్మరులేకాని నివురు నిప్పును బుగ్గి చేస్తుంది. నియమం కొత్త అడుగును కోసేస్తుంది. ఆకాశంలో పక్షి నడకకులాగ కొన్ని నడకలకు పాదముద్రలుండవు. ఇరుకు తరాజుల కురచ తూనికరాళ్ల వైశాల్యానిదే తప్పంతా..
- ప్రసేన్