"స్వీటూరి - హాటూరి - గ్రేటూరి”
సరస్వతి ప్రియపుత్రుడు వేటూరి సుందరరామ్మూర్తి గారి సాహిత్యంపై 4 వాల్యూమ్స్ మాధురిగారు ఒక ఉద్గ్రంథ రచనకు పూనుకున్నారని తెలిసి వేటూరి భక్తుడిగా పరమానందభరితుడనయ్యాను. అమెరికాలో స్థిర నివాసమేర్పరచుకున్న వేటూరి వీరాభిమాని, ఉత్తమస్థాయి ప్రమాణాలతో ఇప్పటికే తన రచనాశక్తిని నిరూపించుకున్న రచయిత్రిగా మాధురిగారు ఈ పుస్తక రచన చేపట్టడం మిక్కిలి ముదావహం! నేను 2012లో వేటూరిగారి జన్మదినం సందర్భంగా ముప్పైకి పైగా వేటూరి పాటలను ఎంచుకొని “కలకాలం ఇదే పాడనీ" అనే శీర్షికతో క్యాలిఫోర్నియా బేయేరియాలో స్థానిక గాయనీగాయకులతో ఒక సంగీతవిభావరిని నిర్వహించి వేటూరిగారి పట్ల నా భక్తిని, ఉన్మాదాన్ని చాటుకున్నాను. ఇప్పుడు తోటి వేటూరి వీరాభిమాని మాధురిగారు చేస్తున్న ఈ వేటూరి సినీ సాహిత్య యాగాన్ని మనసారా అభినందిస్తున్నాను.
వేటూరి అభిమానుల ఏజి, రేంజి చాలా పెద్దది - అటు తొమ్మిదేళ్ళ వారి నించీ తొమ్మిది పదులు నిండిన వయోవృద్ధుల వరకు, ఇటు పండిత పామరులూ సమానంగా ఉన్నారు. నా మటుకు నాకు 1975 (ఎదురులేని మనిషిలోని "కృష్ణా ముకుందా మురారి" పాట) నుంచి 1995 వరకు వచ్చిన వేటూరి పాటలతో గాఢానుబంధం ఉంది. ముఖ్యంగా 70వ /80వ/90వ దశకాల్లోని వేటూరి...........................
"స్వీటూరి - హాటూరి - గ్రేటూరి” సరస్వతి ప్రియపుత్రుడు వేటూరి సుందరరామ్మూర్తి గారి సాహిత్యంపై 4 వాల్యూమ్స్ మాధురిగారు ఒక ఉద్గ్రంథ రచనకు పూనుకున్నారని తెలిసి వేటూరి భక్తుడిగా పరమానందభరితుడనయ్యాను. అమెరికాలో స్థిర నివాసమేర్పరచుకున్న వేటూరి వీరాభిమాని, ఉత్తమస్థాయి ప్రమాణాలతో ఇప్పటికే తన రచనాశక్తిని నిరూపించుకున్న రచయిత్రిగా మాధురిగారు ఈ పుస్తక రచన చేపట్టడం మిక్కిలి ముదావహం! నేను 2012లో వేటూరిగారి జన్మదినం సందర్భంగా ముప్పైకి పైగా వేటూరి పాటలను ఎంచుకొని “కలకాలం ఇదే పాడనీ" అనే శీర్షికతో క్యాలిఫోర్నియా బేయేరియాలో స్థానిక గాయనీగాయకులతో ఒక సంగీతవిభావరిని నిర్వహించి వేటూరిగారి పట్ల నా భక్తిని, ఉన్మాదాన్ని చాటుకున్నాను. ఇప్పుడు తోటి వేటూరి వీరాభిమాని మాధురిగారు చేస్తున్న ఈ వేటూరి సినీ సాహిత్య యాగాన్ని మనసారా అభినందిస్తున్నాను. వేటూరి అభిమానుల ఏజి, రేంజి చాలా పెద్దది - అటు తొమ్మిదేళ్ళ వారి నించీ తొమ్మిది పదులు నిండిన వయోవృద్ధుల వరకు, ఇటు పండిత పామరులూ సమానంగా ఉన్నారు. నా మటుకు నాకు 1975 (ఎదురులేని మనిషిలోని "కృష్ణా ముకుందా మురారి" పాట) నుంచి 1995 వరకు వచ్చిన వేటూరి పాటలతో గాఢానుబంధం ఉంది. ముఖ్యంగా 70వ /80వ/90వ దశకాల్లోని వేటూరి...........................© 2017,www.logili.com All Rights Reserved.