నిబద్ధత, అంకిత భావం, జిజ్ఞాస, ప్రలోభాలకు లొంగని నైజం - ఇవన్నీ కథా రచనలో చేయి తిరిగిన రచయితగా పేరు తెచ్చుకున్న ఈశ్వర్ ని అనతికాలంలోనే జర్నలిజంలోనూ సిద్ధహస్తుడిని చేశాయి. బి కె ఈశ్వర్ నుండి ఆయన పేరు 'విజయచిత్ర ఈశ్వర్' గా మారేంతగా, భావ సారూప్యం ఉన్న వ్యక్తులు లభిస్తే పత్రిక నాణ్యతాప్రమాణాలతో మరింతగా రాణిస్తుందనదానికి ఉదాహరణ ఈశ్వర్. కాలక్రమంలో రచయితగా, జర్నలిస్ట్ గా ఆయన మరింతగా ఎదిగారు. ఇన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఈశ్వర్ మూలాన్ని మరువలేదనడానికి నిదర్శనం - ఈ 'విజయచిత్ర జ్ఞాపకాలు'. అనివార్య కారణాలవాల్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 'విజయచిత్ర' యాత్రకు నిర్బంధ విరామం ఏర్పడిందిగానీ - ఇది 'విజయచిత్ర' కి స్వర్ణోత్సవ సంవత్సరం. ఈ సందర్భంగా అత్యంత ప్రియమైన పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్న చిరుకానుక - 'విజయచిత్ర జ్ఞాపకాలు'.
నిబద్ధత, అంకిత భావం, జిజ్ఞాస, ప్రలోభాలకు లొంగని నైజం - ఇవన్నీ కథా రచనలో చేయి తిరిగిన రచయితగా పేరు తెచ్చుకున్న ఈశ్వర్ ని అనతికాలంలోనే జర్నలిజంలోనూ సిద్ధహస్తుడిని చేశాయి. బి కె ఈశ్వర్ నుండి ఆయన పేరు 'విజయచిత్ర ఈశ్వర్' గా మారేంతగా, భావ సారూప్యం ఉన్న వ్యక్తులు లభిస్తే పత్రిక నాణ్యతాప్రమాణాలతో మరింతగా రాణిస్తుందనదానికి ఉదాహరణ ఈశ్వర్. కాలక్రమంలో రచయితగా, జర్నలిస్ట్ గా ఆయన మరింతగా ఎదిగారు. ఇన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఈశ్వర్ మూలాన్ని మరువలేదనడానికి నిదర్శనం - ఈ 'విజయచిత్ర జ్ఞాపకాలు'. అనివార్య కారణాలవాల్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 'విజయచిత్ర' యాత్రకు నిర్బంధ విరామం ఏర్పడిందిగానీ - ఇది 'విజయచిత్ర' కి స్వర్ణోత్సవ సంవత్సరం. ఈ సందర్భంగా అత్యంత ప్రియమైన పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్న చిరుకానుక - 'విజయచిత్ర జ్ఞాపకాలు'.© 2017,www.logili.com All Rights Reserved.