మనిషి జీవించడానికి ఆహారం అవసరం. మనిషి నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అవసరమైన శక్తి కూడా ఆహారం నుంచే వస్తుంది. ఆహారంలో నీటితోపాటు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, ఖనిజలవణాలు, విటమిన్లు ఉంటాయి. మానవ శరీరంలోని జీవక్రియలకు ఇవన్నీ అవసరం. అయితే వీటిపాళ్ళు సమతుల్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషి ఆరోగ్యంగా లేనిదే వివిధ పనులు నిర్వహించలేడు. మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు. అయితే అది ఆరోగ్యంతోనే సాధ్యపడుతుంది. పైగా ఎంతకాలం జీవించమనే దానికంటే ఎంత ఆరోగ్యంగా జీవించామన్నది ముఖ్యం. ఆరోగ్యంగా జీవించినప్పుడే ఏదైనా సాధించగలం.
ఈ 'ఆహారం - ఆరోగ్యం' పుస్తకంలో పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం మొదలగు ఆహారాల గురించి, వాటిలో గల పోషకాలు, వాటి వలన ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. పాఠకులు వారు రోజూ తీసుకునే ఆహారంలో వీటిని పరిగణనలోకి తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే ఆశతోనే 'పశునేస్తం' పశు, మత్స్య రైతుకుటుంబ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించిన డా జి ఎన్ రావు వ్యాసాల ఆధారంగా ఈ చిన్న పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని రచించిన 'పశునేస్తం' కార్యనిర్వాహక సంపాదకులు జి ఎన్ రావు గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని, ఈ పుస్తకాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను.
- వై వెంకటేశ్వరరావు
మనిషి జీవించడానికి ఆహారం అవసరం. మనిషి నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అవసరమైన శక్తి కూడా ఆహారం నుంచే వస్తుంది. ఆహారంలో నీటితోపాటు పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, ఖనిజలవణాలు, విటమిన్లు ఉంటాయి. మానవ శరీరంలోని జీవక్రియలకు ఇవన్నీ అవసరం. అయితే వీటిపాళ్ళు సమతుల్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యము. మనిషి ఆరోగ్యంగా లేనిదే వివిధ పనులు నిర్వహించలేడు. మనిషి జీవితకాలం వంద సంవత్సరాలు. అయితే అది ఆరోగ్యంతోనే సాధ్యపడుతుంది. పైగా ఎంతకాలం జీవించమనే దానికంటే ఎంత ఆరోగ్యంగా జీవించామన్నది ముఖ్యం. ఆరోగ్యంగా జీవించినప్పుడే ఏదైనా సాధించగలం. ఈ 'ఆహారం - ఆరోగ్యం' పుస్తకంలో పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, మాంసం మొదలగు ఆహారాల గురించి, వాటిలో గల పోషకాలు, వాటి వలన ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. పాఠకులు వారు రోజూ తీసుకునే ఆహారంలో వీటిని పరిగణనలోకి తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారనే ఆశతోనే 'పశునేస్తం' పశు, మత్స్య రైతుకుటుంబ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించిన డా జి ఎన్ రావు వ్యాసాల ఆధారంగా ఈ చిన్న పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకాన్ని రచించిన 'పశునేస్తం' కార్యనిర్వాహక సంపాదకులు జి ఎన్ రావు గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నాన్ని పాఠకులు ఆదరిస్తారని, ఈ పుస్తకాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. - వై వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.