ప్రముఖ స్వామీజీ ఈ ఆధునిక యుగంలో గొప్ప స్పూర్తి ప్రదాత అయిన ఆధ్యాత్మిక గురువు, భగవాన్ స్వామి నారాయణ్ కు ఐదవ ఆధ్యాత్మిక వారసులు. ప్రముఖ స్వామీజీ ఒక సందర్భంలో భరతమాత ముద్దు బిడ్డ భారతదేశ 11 వ రాష్ట్రపతి డా ఎ పి జె అబ్దుల్ కలాం ను కలిసి మాట్లాడటం జరిగింది. వారి కలయిక వైజ్ఞానిక, ఆధ్యాత్మికతల అపూర్వ సాంగత్యం. 'అతీంద్రియం' అనే ఈ పుస్తకంలో కలాం, సహ రచయిత, శిష్యుడు అరుణ్ తివారితో కలిసి ప్రముఖ స్వామీజీ ఆత్మజ్ఞాన ప్రస్థానాన్ని, ఆధ్యాత్మిక శక్తి, వైశిష్ట్యాన్ని, శాస్త్ర, మత భావనల సామరస్యాన్ని విశదంగా విస్పష్టంగా చిత్రించారు.
భారతదేశం సామాజిక, రాజకీయ పరిస్థితులు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ప్రసక్తమయాయి. భారత దేశంలోని వైజ్ఞానిక, సామాజిక ఉద్యమాలను చిత్రించారు. ప్రపంచానికి ప్రముఖ స్వామీజీ ప్రసరించిన వెలుగులను మనకు దర్శింపజేశారు. స్వామీజీ ఆధ్యాత్మిక మానవాళికి ఎలా అనుసరణీయమో చర్చించారు. గొప్ప వైజ్ఞానికుల, సృజనాత్మక రచయితల జీవన చిత్రణలతో ఈ పుస్తకం ఆధ్యాత్మిక సంపదగా, జ్ఞాననిధిగా దర్శనమిస్తుంది. భారతీయ సమాజంలోని వైవిధ్యానికి బహుముఖమైన ఆలోచనలకు ఈ పుస్తకం ఒక దర్పణం.
ప్రముఖ స్వామీజీ ఈ ఆధునిక యుగంలో గొప్ప స్పూర్తి ప్రదాత అయిన ఆధ్యాత్మిక గురువు, భగవాన్ స్వామి నారాయణ్ కు ఐదవ ఆధ్యాత్మిక వారసులు. ప్రముఖ స్వామీజీ ఒక సందర్భంలో భరతమాత ముద్దు బిడ్డ భారతదేశ 11 వ రాష్ట్రపతి డా ఎ పి జె అబ్దుల్ కలాం ను కలిసి మాట్లాడటం జరిగింది. వారి కలయిక వైజ్ఞానిక, ఆధ్యాత్మికతల అపూర్వ సాంగత్యం. 'అతీంద్రియం' అనే ఈ పుస్తకంలో కలాం, సహ రచయిత, శిష్యుడు అరుణ్ తివారితో కలిసి ప్రముఖ స్వామీజీ ఆత్మజ్ఞాన ప్రస్థానాన్ని, ఆధ్యాత్మిక శక్తి, వైశిష్ట్యాన్ని, శాస్త్ర, మత భావనల సామరస్యాన్ని విశదంగా విస్పష్టంగా చిత్రించారు. భారతదేశం సామాజిక, రాజకీయ పరిస్థితులు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో ప్రసక్తమయాయి. భారత దేశంలోని వైజ్ఞానిక, సామాజిక ఉద్యమాలను చిత్రించారు. ప్రపంచానికి ప్రముఖ స్వామీజీ ప్రసరించిన వెలుగులను మనకు దర్శింపజేశారు. స్వామీజీ ఆధ్యాత్మిక మానవాళికి ఎలా అనుసరణీయమో చర్చించారు. గొప్ప వైజ్ఞానికుల, సృజనాత్మక రచయితల జీవన చిత్రణలతో ఈ పుస్తకం ఆధ్యాత్మిక సంపదగా, జ్ఞాననిధిగా దర్శనమిస్తుంది. భారతీయ సమాజంలోని వైవిధ్యానికి బహుముఖమైన ఆలోచనలకు ఈ పుస్తకం ఒక దర్పణం.© 2017,www.logili.com All Rights Reserved.