ఈ పుస్తకం భారతదేశానికి మార్మిక యాత్ర. ఈ యాత్రలో మా నిర్దేశకుడు ఓషో. ఆయన గొప్ప మార్మికుడూ, కథలు చెప్పడంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కలిగినవాడే కాక భారతదేశపు బంగారు గతానికి సమకాలీన తాజా పరిమళాన్ని అద్ది అనన్యమైన శైలీ, సామర్ధ్యాలతో భిక్షువులనూ - రాజులనూ, వివేకులనూ - మూర్ఖులనూ, ప్రేమికులనూ - సైనికులనూ, కళాకారులనూ - పండితులనూ మనకు పరిచయం చేస్తారు. ఆ పేజీలలో వారు సజీవంగా సాక్షాత్కరిస్తారు. మన కళ్ళకు కట్టినట్లుగా భారతదేశపు రూపురేఖలను కనుచూపుమేర దర్శిస్తున్నట్లు సమ్మోహనంగా అన్వేషకులను, యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటారు. భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రదేశమో, చారిత్రిక విషయమో కాదు. అది ఒక జాతో, దేశమో లేక కొంత భూభాగామో కాదు. వాటన్నిటికంటే మించింది. అది ఒక రూపకం, కవిత్వం. అది అదృశ్యమైంది కానీ స్పర్శకు అందుతుంది. అది ఒక శక్తివలయంతో స్పందిస్తూ ఉంటుంది. అలాంటి అవకాశం భారతదేశానికి తప్ప ఏ దేశానికీ లేదు.
- ఓషో
ఈ పుస్తకం భారతదేశానికి మార్మిక యాత్ర. ఈ యాత్రలో మా నిర్దేశకుడు ఓషో. ఆయన గొప్ప మార్మికుడూ, కథలు చెప్పడంలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కలిగినవాడే కాక భారతదేశపు బంగారు గతానికి సమకాలీన తాజా పరిమళాన్ని అద్ది అనన్యమైన శైలీ, సామర్ధ్యాలతో భిక్షువులనూ - రాజులనూ, వివేకులనూ - మూర్ఖులనూ, ప్రేమికులనూ - సైనికులనూ, కళాకారులనూ - పండితులనూ మనకు పరిచయం చేస్తారు. ఆ పేజీలలో వారు సజీవంగా సాక్షాత్కరిస్తారు. మన కళ్ళకు కట్టినట్లుగా భారతదేశపు రూపురేఖలను కనుచూపుమేర దర్శిస్తున్నట్లు సమ్మోహనంగా అన్వేషకులను, యాత్రికులను ఆకర్షిస్తూ ఉంటారు. భారతదేశం అంటే కేవలం భౌగోళిక ప్రదేశమో, చారిత్రిక విషయమో కాదు. అది ఒక జాతో, దేశమో లేక కొంత భూభాగామో కాదు. వాటన్నిటికంటే మించింది. అది ఒక రూపకం, కవిత్వం. అది అదృశ్యమైంది కానీ స్పర్శకు అందుతుంది. అది ఒక శక్తివలయంతో స్పందిస్తూ ఉంటుంది. అలాంటి అవకాశం భారతదేశానికి తప్ప ఏ దేశానికీ లేదు. - ఓషో© 2017,www.logili.com All Rights Reserved.