ఈ అసాధారణమైన పుస్తకం తన కథని మన ముందు ఆవిష్కరిస్తున్న తీరు గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. 19, 20 శతాబ్దాలలో ప్రజలు 'చరిత్ర'ను అనుభవంలోకి తెచ్చుకున్న తీరు ప్రత్యేకం. వారు దాన్నొక 'వేదిక' గా చూశారు. అది జీవజీవాలు నిండిన వేదిక, దాని మీద ఎటు చూసినా పోరాటాలే. తమ భవితవ్యాన్ని ఎంచుకోవటం కోసం, దాన్ని సాధించుకోవటం కోసం, మరింత న్యాయవంతమైన జీవితాల కోసం పోరాడుతున్న స్త్రీ పురుషులే అంతటా స్పూర్తిగా, ఆలంబంనగా, నేపథ్యంగా నిలబడ్డాయి. అటువంటి చారిత్రిక వేదిక.. శోభాయమానమైన రంగస్థల అలంకరణ. అద్భుతమైన ధ్వని. కాంతి నిర్వహణలతో జీవిత్వంతో అలరారే ఆ వేదిక.. నాటి కవితల్లో, గేయాలలో, పాటల్లో, లిఖిత కథనాల్లో, రాజకీయ సమావేశాల్లో, తిరుగుబాట్లలో, ఉమ్మడి కలల్లో.. అన్నింటా దర్శనమిచ్చేది. కానీ ఇదంతా గతం!
ఈ అసాధారణమైన పుస్తకం తన కథని మన ముందు ఆవిష్కరిస్తున్న తీరు గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. 19, 20 శతాబ్దాలలో ప్రజలు 'చరిత్ర'ను అనుభవంలోకి తెచ్చుకున్న తీరు ప్రత్యేకం. వారు దాన్నొక 'వేదిక' గా చూశారు. అది జీవజీవాలు నిండిన వేదిక, దాని మీద ఎటు చూసినా పోరాటాలే. తమ భవితవ్యాన్ని ఎంచుకోవటం కోసం, దాన్ని సాధించుకోవటం కోసం, మరింత న్యాయవంతమైన జీవితాల కోసం పోరాడుతున్న స్త్రీ పురుషులే అంతటా స్పూర్తిగా, ఆలంబంనగా, నేపథ్యంగా నిలబడ్డాయి. అటువంటి చారిత్రిక వేదిక.. శోభాయమానమైన రంగస్థల అలంకరణ. అద్భుతమైన ధ్వని. కాంతి నిర్వహణలతో జీవిత్వంతో అలరారే ఆ వేదిక.. నాటి కవితల్లో, గేయాలలో, పాటల్లో, లిఖిత కథనాల్లో, రాజకీయ సమావేశాల్లో, తిరుగుబాట్లలో, ఉమ్మడి కలల్లో.. అన్నింటా దర్శనమిచ్చేది. కానీ ఇదంతా గతం!© 2017,www.logili.com All Rights Reserved.