ఈ పుస్తకం కొందరు స్త్రీలవివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దుఃఖానికీ, ఆ దుఃఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి ఉన్న మరో అమూల్యమైన విషయం స్త్రీలచరిత్ర. స్త్రీలు నిర్మించిన మన దేశ చరిత్ర. ఈ స్త్రీలు స్త్రీలచరిత్రలో అతి ముఖ్యమైన పాత్ర వహించినవాళ్ళు. దేశ చరిత్రకు రాళ్లెత్తిన కూలీలు. వీరంతా దేశ స్వాతంత్ర్యానికి ముందు జన్మించిన వాళ్ళు.
స్వతంత్రోద్యమాన్ని దగ్గర గానో, కాస్త దూరంగానో చూస్తూ, ఆ ఉద్యమ ఛాయాలలో సంచరిస్తూ ఆ స్వతంత్రేచ్చ కల్పించిన ఆశలదారులవెంట నడిచిన వాళ్ళు. దేశ నిర్మాణమనే పనిలో కొందరు తమ సంకల్పంతో ప్రత్యేక్షంగా భాగస్వాములైతే మరికొందరు పరోక్షంగా చరిత్రని ప్రభావితం చేశారు. వీరు తమ కుటుంబాలలో మొదటితరం విద్యాధికులైన స్త్రీలు. బానిసత్వ భారం లేకుండా తమ తమ రంగాలలోకి ప్రవేశించినవాళ్ళు. ఎంపిక చేసుకునే హక్కుని పొందిన స్త్రీలు. ఆ హక్కుని సఫలం చేసుకున్న స్త్రీలు.
- ఓల్గా
ఈ పుస్తకం కొందరు స్త్రీలవివాహ జీవితాలకు, జీవిత భాగస్వాములను కోల్పోయిన వారి వియోగ దుఃఖానికీ, ఆ దుఃఖంతో యుద్ధం చేస్తూ తమ జీవితాలను అర్థవంతంగా కొనసాగించే వారి స్థితప్రజ్ఞతకు సంబంధించినదిగా కనిపిస్తుంది. అందులో అసత్యమేమీ లేదు. ఈ పుస్తకంలో కనిపించే విషయం అదే. కానీ ఈ పుస్తకంలో దాగి ఉన్న మరో అమూల్యమైన విషయం స్త్రీలచరిత్ర. స్త్రీలు నిర్మించిన మన దేశ చరిత్ర. ఈ స్త్రీలు స్త్రీలచరిత్రలో అతి ముఖ్యమైన పాత్ర వహించినవాళ్ళు. దేశ చరిత్రకు రాళ్లెత్తిన కూలీలు. వీరంతా దేశ స్వాతంత్ర్యానికి ముందు జన్మించిన వాళ్ళు. స్వతంత్రోద్యమాన్ని దగ్గర గానో, కాస్త దూరంగానో చూస్తూ, ఆ ఉద్యమ ఛాయాలలో సంచరిస్తూ ఆ స్వతంత్రేచ్చ కల్పించిన ఆశలదారులవెంట నడిచిన వాళ్ళు. దేశ నిర్మాణమనే పనిలో కొందరు తమ సంకల్పంతో ప్రత్యేక్షంగా భాగస్వాములైతే మరికొందరు పరోక్షంగా చరిత్రని ప్రభావితం చేశారు. వీరు తమ కుటుంబాలలో మొదటితరం విద్యాధికులైన స్త్రీలు. బానిసత్వ భారం లేకుండా తమ తమ రంగాలలోకి ప్రవేశించినవాళ్ళు. ఎంపిక చేసుకునే హక్కుని పొందిన స్త్రీలు. ఆ హక్కుని సఫలం చేసుకున్న స్త్రీలు. - ఓల్గా© 2017,www.logili.com All Rights Reserved.